English | Telugu
అవినాష్ నీ వల్లే ఇదంతా.. వైరల్ గా మారిన అరియానా వీడియో!
Updated : Mar 2, 2023
సెలబ్రిటీ ఇంటర్వ్యూల పేరుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సొంతం చేసుకుంది అరియానా గ్లోరీ. డైరెక్టర్ రాంగోపాల్‌వర్మతో చేసిన ఓ హాట్ ఇంటర్వ్యూ ఆమె ఫేట్‌ని పూర్తిగా మార్చేసింది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ నుంచి వచ్చాక ఆమెకు బుల్లి తెర మీద అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు బీబీ జోడిలో అవినాష్ కి జోడీగా చేస్తోంది.
ఐతే బీబీ జోడి చేసే డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఒక్కోసారి కొంత మందికి గాయాలు కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలానే జరిగింది ఆరియానాకి కూడా. "మిస్టర్ ముక్కు అవినాష్ గారు చూడండి..డాన్స్ లో, పెర్ఫార్మెన్స్ లో పక్కన ఆర్టిస్టులను పట్టించుకోకుండా.. మీ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ తో పెర్ఫార్మ్ చేస్తే అవతలి వాళ్ళు ఎలా బలవుతారో.. బీబీ జోడిలో చేసిన పెర్ఫార్మెన్స్ కి నా చెయ్యి చూడండి... ఇలా దెబ్బ తగిలి కమిలిపోయింది నాకు. దీన్ని నేను ఖండిస్తున్నాను అవినాష్ గారు" అని చెప్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.
ఇక ఆరియానా స్టార్స్ తో ఈక్వల్ గా సోషల్ మీడియాని దున్నేస్తోంది. రకరకాల పోస్టులు, వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. మొదట్లో తన మీద ఎలాంటి నెగటివ్ టాక్ వచ్చినా వెంటనే వాళ్ళ మీద తిరగబడేది. కానీ తర్వాత్తర్వాత వాటిని పట్టించుకోవడం మానేసింది. బీబీ హౌస్ లో బీబీ కేఫ్ నిర్వహించింది అరియనా. ఏది జరిగినా మన మంచికే అంటూ అప్పుడప్పుడు వేదాంతం కూడా చెప్తూ ఉంటుంది ఈ అమ్మడు.