English | Telugu

ఇండియన్ ఐడల్ 2 ఆడిషన్స్ లో అదరగొట్టిన బిఎస్ఎఫ్ జవాన్

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఆడిషన్స్ మొదలయ్యాయి. ఈ ఆడిషన్ కి చక్రపాణి అనే ఒక బిఎస్ఎఫ్ జవాన్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. ఆయన పాడిన పాటకు జడ్జెస్ కార్తీక్, తమన్, గీతామాధురి ఫిదా ఐపోయారు. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో పని చేస్తున్న చక్రపాణికి సంగీతం అంటే ప్రాణం. ఆ ఇష్టంతోనే ఈ ఆడిషన్స్ కి వచ్చినట్లు చెప్పారు. "అసలు మ్యూజిక్ వినడానికే టైం ఉండదు. కానీ బోర్డర్ లో డ్యూటీ చేస్తూ పాటలు పాడుతూ ఉంటాను" అని చెప్పారు. "కొంతమంది అవకాశం ఉండి కూడా నేర్చుకోలేకపోతున్నారు.. కానీ నెట్వర్క్ లేని చోట కూడా పాటలు నేర్చుకొని పాడడానికి వస్తున్నారంటే అది పెద్ద విషయం" అని అన్నారు థమన్.

ఇక ఆయన పాడిన పాటకు "ఎస్" అని చాలా గర్వంగా చెప్పారు కార్తీక్. "ఒక్క నిమిషం..మీరు ఎస్ అంటున్నారు..కానీ నేను నో అంటున్నాను.. ఎందుకంటే నా లీవ్స్ ఐపోయాయి. బోర్డర్ కి వెళ్లిపోవాల్సిన టైం వచ్చింది." అని చెప్పారు చక్రపాణి. "మిలిటరీ నుంచి వచ్చి ఇలా స్టేజి మీద పాట పాడడం నిజంగా చాలా గర్వించాల్సిన విషయం.. సంగీతానికి మీరు ఎంతో విలువిచ్చారు." అన్నారు థమన్. వెంటనే ముగ్గురు జడ్జెస్ లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. "మీ వాళ్ళతో మేము మాట్లాడి ఏమైనా చేయొచ్చా" అని థమన్ చక్రపాణిని అడిగారు. మరి ఈ కంటెస్టెంట్ టాప్-12 లో ఉంటారా? అనే విషయం తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేసి ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ ఆడిషన్స్ మార్చి 3 నుంచి ప్రతీ శుక్రవారం- శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమవుతుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.