English | Telugu
వంటలక్క లేకుండానే డాక్టర్ బాబు కొత్త సీరియల్!
Updated : Mar 2, 2023
నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు.. బుల్లితెర సీరియల్ స్టార్ హీరో అని అనడంలో ఆశ్చర్యమే లేదు. కార్తీక దీపం సీరియల్ లో దీపతో కలిసి నటించిన డాక్టర్ బాబుని ఈ సీరియల్ అభిమానులు దేవుడిలా కొలిచారు. కార్తిక్, దీపలని చూడటానికి ప్రేక్షకులు పనులు మానుకొని ఎదురుచూసేవారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కార్తీకదీపం మళ్ళీ కలుస్తాం అంటూ ముగింపులో చెప్పడంతో.. దీనికి సీక్వెల్ ఉంటుందేమోననే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. దానికి సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని కూడా ప్రచారం జరిగింది.
ఇది ఇలా ఉండగా వంటలక్క తన బిజినెస్ పనుల్లో బిజీగా ఉండగా.. కార్తిక్ అలియాస్ నిరుపమ్ పరిటాల మరో సీరియల్ తో బిజీ అయ్యాడు. ఆయన లీడ్ రోల్ చేస్తోన్న సీరియల్ "రాధ కి నీవేరా ప్రాణం". ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారం కానుంది. ఇందులో నిరుపమ్ సరసన 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ ఫేమ్ గోమతి చేస్తుంది. "రాధ కి నీవేరా ప్రాణం" సీరియల్ కి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది.
అయితే ఇది డాక్టర్ బాబు ఫ్యాన్స్ కి ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కార్తీక దీపం చూసే ప్రేక్షకులు డాక్టర్ బాబుని ఇన్ని రోజులు బాగా మిస్ అయ్యారు. మళ్ళీ సీరియల్ లో కనిపించి ప్రేక్షకులకు మరింత దగ్గరవాలని అనుకుంటున్నాడు డాక్టర్ బాబు. కాని వంటలక్క, డాక్టర్ బాబుల కార్తీకదీపం సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి దీప లేకుండా కార్తిక్ చేస్తోన్న ఈ సీరియల్ ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.