English | Telugu

వసుధార మెడలో తాళిపడటానికి కారణం నేనే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -700 లో.. వసుధార మెడలో తాళి పడడానికి కారణం రిషి అని చెప్తుంది జగతి. అప్పుడే ప్రెస్ మీటింగ్ కి వచ్చిన రిషిని చూసిన దేవాయని.. "రా నాన్న రిషి జగతి ఏదో మాట్లాడుతుంది. అది అబద్ధమని చెప్పు" అని అనగానే.. రిషి స్టేజి మీదకి వెళ్ళి.. "ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు.. కానీ జగతి మేడం చెప్పిన మాటలన్నీ నిజాలే" రిషి అనగానే.. దేవయాని షాక్ అవుతుంది. వసుధార, జగతి ఇద్దరు హ్యాపీగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వసుధార మెడలో తాళి పడడానికి కారణం నేనే.. కానీ అ విషయం నా పర్సనల్.. అది ప్రెస్ ముందు డిస్కస్ చెయ్యడం కరెక్ట్ కాదు.. ఇంకా ఈ ప్రెస్ మీట్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాత్రమే.. దీని గురించిన విషయాలు వసుధార మాట్లాడుతుందని చెప్తాడు రిషి.

రిషి మాటలు విన్న దేవయాని కోపంతో అక్కడ నుండి వెళ్తుండగా.. రిషి తన వెనకాలే వెళ్ళి.. పెద్దమ్మ ఆగు అని చెప్పిన వినకుండా వెళ్తుంటుంది. చిన్నప్పటి నుండి పెంచాను.. ఇప్పుడు నాకు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావ్ అని దేవయాని అంటుంది. పెద్దమ్మ నీకు జరిగిందంతా చెప్తాను.. కొంచెం నన్ను అర్థం చేసుకోండని రిషి అంటాడు. ఇంకా ఎక్కువ బెట్టు చేస్తే బాగోదని భావించిన దేవయాని.. సరే నాన్న రిషి.. నిన్ను అర్ధం చేసుకున్నాను అన్నట్టుగా మాట్లాడి ఫణింద్రతో కలిసి వెళ్ళిపోతుంది.

మరోవైపు అందరి ముందు నన్ను భార్యగా ఒప్పుకున్నాడన్న సంతోషంలో వసుధార రిషి క్యాబిన్ దగ్గర ఉన్న హార్ట్ సింబల్ ని పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అక్కడికి రిషి వచ్చి.. "ఏంటి హ్యాపీగా ఉన్నావ్" అని అంటాడు. మీరు నా భర్త అని ఒప్పుకున్నారు కదా సార్ అని వసుధార అనగానే.. నీకు నేను భర్తనని చెప్పాను కాని నువ్వు నా భార్యవని చెప్పలేదు కదా అని అంటాడు. అందరిలో నువ్వు తలదించుకునే పరిస్థితి వస్తే.. నీ బాధని నా బాధగా భావించి ఒప్పుకున్నాను అని రిషి అంటాడు. మరి అది నిజం కాదంటారా సర్ అని వసుధార అంటుంది. నిజమే నీ ఇష్టానికి నువ్వు తాళి నన్ను ఊహించుకొని వేసుకున్నావ్.. నా ప్రమేయం లేకుండా నీకు నచ్చినట్లు మలుచుకున్నావ్.. అని రిషి తప్పు పడుతూనే ఉంటాడు. వసుధార ఎంత అర్థం అయ్యేలా చెప్పిన రిషి వినిపించుకోడు. ఇక రిషి, వసుధారని తన భార్యగా అంగీకరిస్తాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.