English | Telugu
మురారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కృష్ణ!
Updated : Mar 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -94 లో.. మురారితో మాట్లాడుతుంటుంది ముకుంద. నీ అగ్రిమెంట్ భార్య ఈ మధ్య హద్దులు దాటుతుందని ముకుంద అనడంతో.. "హద్దులు అంటే ఏంటి" అని మురారి అడుగుతాడు. లిమిట్స్ అని ముకుంద చెప్తుంది. అవునా మరి లిమిట్స్ అంటే ఏంటి? మా శోభనం రోజున నువ్వు మా గది డోర్ కొట్టడమా అని మురారి అనేసరికి.. ముకుంద షాక్ అవుతుంది. "మాది అగ్రిమెంట్ మ్యారేజ్ కావచ్చు.. ఒకవేళ కృష్ణ వెళ్ళిపోయినా కూడా.. కృష్ణ నా భార్య అనే చెప్తాను. నేను తనకే సపోర్ట్ చేస్తాను" అని ముకుందకి వార్నింగ్ ఇస్తాడు మురారి.
మరుసటి రోజు భవాని ఇంట్లో పని చేశాకే కాలేజీకి వెళ్ళాలని చెప్పింది గుర్తుచేసుకొని కృష్ణ ఉదయన్నే నిద్ర లేస్తుంది. తన గదిలోకే కూరగాయలు అన్నీ తెచ్చుకొని కట్ చేస్తుంది. ఆ కూరగాయలు కట్ చేసే చప్పుడు కి లేచిన మురారి.. "ఏంటి ఇక్కడ కట్ చేస్తున్నావ్" అని అడుగుతాడు. లేదు ఏసీపి సర్.. పెద్ద అత్తయ్య ఇంట్లో పని చేసే కాలేజీకి వెళ్ళమని చెప్పింది. మా గౌతమ్ సర్ ఏమో రెండు ఫైల్స్ రాసుకొని రమ్మని చెప్పాడు అని చెప్తుంది. ఆ తర్వాత ముకుంద చేసిన గొడవ అంతా మురారికి చెప్తుంది కృష్ణ.. "సరే కృష్ణ నేను రాస్తాను.. నువ్వు వంట చెయ్" అని మురారి అంటాడు. లేదు ఏసీపి సర్.. మా సీనియర్ డాక్టర్ చేతివ్రాత గుర్తుపడితే నా తలరాత మారుస్తాడని కృష్ణ చెప్తుంది. సరే నేను వెజిటేబుల్స్ కట్ చేస్తా అని మురారి కట్ చేస్తుండగా కూరగాయల ముక్కలన్ని కూడా ఒక్కొక్క వైపు పడిపోతుంటాయి. అది చూసి కృష్ణ.. నేను కట్ చెయ్యడం నేర్పిస్తానని చెప్పి.. మురారి చెయ్యి పట్టుకొని నేర్పిస్తుంది.. ఇక అలాగే మళ్ళీ పడుకున్న మురారిని కృష్ణ లేపి ఒక గిఫ్ట్ ఇస్తుంది. "ఏంటి కృష్ణ నీకు డాక్టర్ కోట్ ఇచ్చానని రివెంజ్ తో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావా" అని మురారి అంటాడు. అదేం లేదు సర్ నేను వెళ్ళిపోయాక మీరు ఇచ్చిన గిఫ్ట్ నాతోనే ఉంటుంది. నేను ఇచ్చిన గిఫ్ట్ మీతో ఉంటుందని కృష్ణ సమాధానమిస్తుంది. కృష్ణ నువ్వు మాటిమాటికి వెళ్ళిపోతా అని అనకు అని చెప్పి మురారి డల్ అవుతాడు. ఆ తర్వాత మురారి గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో గ్రీన్ కలర్ పెన్ ఉంటుంది. అది చూసి ఈ పెన్ ఏంటి కృష్ణ అని అడుగుతాడు మురారి. మీరు ఏసీపి కదా సర్.. మీరు సంతకం చేయవలసి వస్తే దీంతో చెయ్యండని కృష్ణ చెప్తుంది.
కాలేజీకి లేట్ అవుతుంది సర్.. త్వరగా రెడీ అవ్వండని కృష్ణ అనగానే.. మురారి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. అలా వచ్చాక కృష్ణ ఒక టవల్ తో తన తల తుడుస్తున్నట్టుగా భావిస్తాడు మురారి. ఆ తర్వాత మళ్ళీ మాములు అయి.. ఏంటి నేను ఇలా ఉహించుకుంటున్నానా అని తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.