English | Telugu
శ్రీముఖి ఇంట్లో రాకేష్, సుజాత హనీమూన్!
Updated : Mar 2, 2023
మిస్టర్ అండ్ మిస్సెస్ షో ఈమధ్య కాలంలో చాలా రొమాంటిక్ గా తయారయ్యింది. జంటలతో ఆటలు మంచి ఫన్నీగా డిజైన్ చేస్తున్నారు. రాబోయే వారం షోకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రీముఖి ఎంట్రీలోని రాకింగ్ రాకేష్ తో సరదాగా మాట్లాడింది. "రాకేష్ మీ ఇద్దరికీ టెన్షన్ ఉందా" అని అడిగేసరికి "ఉంది ఎందుకుండదు..ఇక పై నుంచి ఈ షో తర్వాత నిన్ను కలవనేమోనన్న చిన్న బెరుకు ఉంది" అన్నాడు...అంటే "నువ్వు చచ్చిపోతున్నావా, నేను చచ్చిపోతున్నానా" అని శ్రీముఖి రివర్స్ లో అడిగింది దాంతో అందరూ నవ్వేశారు. "హనీమూన్ కి ఎక్కడికి వెళ్లారు" అని శ్రీముఖి మళ్ళీ అడిగేసరికి "మీ ఇంటికొచ్చాం అని చెప్పు" అన్నాడు రాకేష్ ఫన్నీగా దాంతో సుజాత విరగబడి నవ్వింది.
ఇక ఈ షోలో ఒక్కో జంటకి ఒక్కో వెరైటీ టాస్క్ ఇచ్చి ఆడించారు. నటి శ్రీవాణి జంటకు ఇచ్చిన రొమాంటిక్ టాస్క్ మాత్రం భలే సరదాగా ఉంది. శ్రీవాణి తన భర్తతో కలిసి ఐస్ క్రీమ్స్ ని పెదాలతో పట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చి ఒక బాక్స్ లో నుండి ఇంకో బాక్స్ లోకి పెట్టాల్సి ఉంటుంది. రాకేష్-సుజాత పెయిర్ కి కొంస్హ్మ్ టాప్ టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. రాకేష్ చేతులకు గ్లాసులను కట్టేసుకున్నాడు. సుజాత వేసే బాల్స్ ఆ కప్పులో పడాలి. కానీ ఈ టాస్క్ లో రాకేష్ మధ్యలో ఒకసారి పడిపోయాడు. ఇలా ఐదు జంటలు వెరైటీ టాస్క్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఐతే ఈ ఐదు జంటల్లో రెండు జంటలు ఎలిమినేట్ అవుతున్నాయి అని అనౌన్స్ చేసింది శ్రీముఖి. మరి ఇందులో సేఫ్ జోన్ లో ఉన్న పెయిర్స్ ఎవరు..ఎలిమినేట్ అవుతున్న పెయిర్స్ ఎవరో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.