English | Telugu

ఓ వైపు పులి... మరోవైపు అషు రెడ్డి... రాహుల్ రచ్చ రచ్చ!

రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమయ్యాడు. అతడు పాడిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట ఎంత పాపులార్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఈ పాటకి గాను ఆస్కార్ అవార్డ్ కూడా అతడిని వరించింది. అయితే తాజాగా అతను దుబాయ్ కి వెళ్ళాడు. అషురెడ్డి, రాహుల్ కలిసి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వీళ్ళు ఇద్దరే కాకుండా ఇండియా నుండి ఇంకా కొంతమంది సెలబ్రిటీలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది.

దుబాయ్ లో సెలబ్రిటీ రీయూనియన్ పేరుతో ఒక ఈవెంట్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందులో పాల్గొనేందుకే రాహుల్ సిప్లిగంజ్ వెళ్ళాడు. గత వారం నుండి రోజుకొక బ్యూటీతో ఫొటోస్ దిగుతూ రీల్స్ చేస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. పలు సినిమాలలో పాటలు పాడుతూ బిజీగా ఉంటున్న రాహుల్.. ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఆ వీడియోలో పులి కూడా ఉండబోతున్నట్లుగా వన్ మినిట్ ఇన్ స్టా మ్యూజిక్ రీలీజ్ చేసాడు.

దుబాయ్ రీయూనియన్ కోసం వెళ్ళిన రాహుల్ సిప్లిగంజ్.. పులితో కలిసి చేసిన రీల్‌తో పాటు జెన్నీఫర్ ఇమాన్యుయల్ తో చేసిన రీల్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. కాగా ఇప్పుడు ఈ రీల్ కూడా ట్రెండింగ్ లో ఉంది. రీయూనియన్ పేరుతో జల్సాలు చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.