English | Telugu
రాజ్ తో పెళ్ళిపీటల మీద కూర్చోడానికి ఒప్పుకున్న కావ్య!
Updated : Mar 3, 2023
స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -33 లో.. స్వప్న లేచిపొయిందని తెలిసి కనకం, కావ్య, అప్పులు బాధపడుతుంటారు. మరోవైపు పెళ్ళి సమయం దగ్గర పడుతుంది. ఇంకా పెళ్ళి కూతురు రాలేదేంటని అక్కడికి వచ్చినవాళ్ళందరు అనుకుంటారు. నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి రుద్రాణి వెళ్తుంది.
రుద్రాణి గదిలోకి వెళ్లేసరికి.. స్వప్న ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదంటూ కనకం బాధపడుతుంటుంది. ఈ మాటలు డోర్ దగ్గర ఉండి రుద్రాణి వింటుంది. ఆ మాటలు విని.. పెళ్ళికూతురు లేచిపోయిందా? ఈ పెళ్లి జరుగుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యానని మనసులో అనుకుంటుంది. ఇక లోపల ఉన్న కనకం వాళ్ళ దగ్గరికి వచ్చి.. స్వప్న ఎక్కడ అని అడుగుతుంది. వస్తుందని కనకం అనగా.. లేచిపోయిన స్వప్న ఎక్కడ నుండి వస్తుందని రుద్రాణి అంటుంది. అలా అనగానే తనకెలా తెలుసని కనకంతో పాటు స్వప్న, అప్పులు ఆశ్చర్యపోతారు.
ఏం చేయమంటారు అమ్మ అంటూ బాధపడుతుండగా.. దుగ్గిరాల ఫ్యామిలీకి కాబోయే కోడలు కోసం ప్రెస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీ వల్ల మాకు ఒక మచ్చ వచ్చేలా ఉంది. ఇన్నిరోజులు ధనవంతురాలు అని ముసుగు వేసుకున్నావ్ కదా.. ఇప్పుడు నీ ఇంకొక కూతురుకి ముసుగు వేసి పెళ్ళిపీటలపై కుర్చోపెట్టని రుద్రాణి అంటుంది. అలా తను అనగానే.. మొదట కనకం ఒప్పుకోదు. ఇక చేసేదేం లేక ఒప్పుకుంటుంది. అయితే కావ్య మాత్రం ఒప్పుకోదు. కనకం బ్రతిమాలేసరికి సరే అని ఒప్పుకుంటుంది. పెళ్ళిపీటల మీద మాత్రమే కూర్చుంటాను.. "అప్పు.. నువ్వు వెళ్ళి పెళ్ళి టైం వరకి అక్కని వెతికి తీసుకురా" అని కావ్య అంటుంది. దానికి అప్పు సరేనని వెళ్తుంది. ఇక అప్పు, స్వప్న ని వెతికి తీసుకొస్తుందో లేదో.. కావ్యతో రాజ్ పెళ్ళి అవుతుందో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.