English | Telugu
ఆమె వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను...ఆదిరెడ్డి
Updated : Mar 2, 2023
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. విమెన్స్ డే సందర్భంగా రాబోతున్న ఈ ఎపిసోడ్ మంచి కలర్ ఫుల్ గా అంతే ఎమోషనల్ గా ఉంది. ఇందులో మానస్ వాళ్ళ అమ్మతో, తేజు వాళ్ళ అమ్మతో, ప్రభాకర్ తన కూతురితో, ఆదిరెడ్డి వాళ్ళ చెల్లెలితో, నటరాజ్ మాస్టర్ తన భార్య, కూతురితో, ఆర్జే చైతు తన బెస్ట్ ఫ్రెండ్ కాజల్ తో కలిసి ఈ స్టేజి మీదకు వచ్చారు. మానస్ వాళ్ళ అమ్మ చూడడానికి ఒక పెద్ద సెలెబ్రిటీల ఉన్నారని శ్రీముఖి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చింది. "మానస్ వాళ్ళ అమ్మ ఓల్డ్ జనరేషన్, కేజీఎఫ్ మమ్మీ అనుకుంటున్నారేమో..కానీ పద్మిని గారు లేటెస్ట్ జనరేషన్ " అంటూ పొగడ్తలతో ముంచెత్తి ఆమెతో డాన్స్ చేయించింది. ఆదిరెడ్డి తన చెల్లి గురించి చెప్పాడు. ఆమెకు చూపు లేదు. ఆమె పెన్షన్ డబ్బుతోనే తాను బెంగళూరు వెళ్లినట్లు ఆమె పెన్షన్ డబ్బుతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఆమె వల్లనే తాను ఇక్కడి వరకు వచ్చినట్లు చెప్పాడు. ఇప్పుడు ఆమెను ఈ స్టేజి మీద నిలబెట్టాను అంటూ గర్వంగా చెప్పాడు.
తమ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఇద్దరు అబ్బాయిలు అంతా ఆడవాళ్ళ డామినేషన్ అని ఆదిరెడ్డి అనేసరికి "మేము మీకంటే ఎందులోనూ తక్కువ కాము..ఆడపిల్లలం" అని స్ట్రాంగ్ గా కౌంటర్ వేసింది ఆదిరెడ్డి చెల్లి. " ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, ఏది వచ్చినా ఫేస్ చేయాలి ఇవన్నీ నేను నేర్చుకున్నది అమ్మ దగ్గరే..నాకొక బెస్ట్ ఫ్రెండ్ అంటే అది మా అమ్మే" అని చెప్తాను అంది తేజస్విని వాళ్ళ అమ్మ గురించి. తర్వాత తేజు "సిరిమల్లె మువ్వా..నా వాడు ఎవరే" అనే సాంగ్ కి డాన్స్ చేసేసరికి "ఏంట్రా అమర్ పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని ఇట్లా వదిలేస్తారా...చూడు ఇంకా నా వాడు ఎవరే అని పాడుకుంటోంది...కాపురం చేయట్లేదేమిట్రా నువ్వు" అని ఫన్నీగా అమర్ దీప్ మీద ఫైర్ అయ్యింది శ్రీముఖి. మానస్ వాళ్ళ అమ్మ ముఖచిత్రాన్ని గీసి రంగులు పూశాడు, ఆదిరెడ్డి తనకు వచ్చిన బిగ్ బాస్ డబ్బులతో తన చెల్లికి ఒక గోల్డ్ నెక్లెస్ తీసుకొచ్చి స్టేజి మీద ఇచ్చాడు. ప్రభాకర్ కూతురు బెస్ట్ మెమరీ ఫోటో లామినేషన్ ని ప్రెసెంట్ చేసింది. తాను ఈ స్టేజిలో ఉన్నానంటే కారణం నా వైఫ్ నా కూతురు అని నటరాజ్ మాస్టర్ తన భార్యకు గజ్జెలు తెచ్చి కాళ్ళకు కాట్టి ఈ స్టేజి మీద స్టెప్స్ వేయించాడు.