English | Telugu

పెళ్ళిపీటల మీద కూర్చుంది కావ్య అని కనిపెట్టిన కృష్ణమూర్తి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-34 లో.. స్వప్న పెళ్ళి టైంకి జంప్ అవుతుంది. రుద్రాణి ఒక ప్లాన్ వేసి పెళ్ళికూతురుగా కావ్యని పెళ్లి పీటల మీద కూర్చోపెట్టడానికి కనకంతో మాట్లాడుతుంది. దాంతో కనకం కావ్యని ఒప్పిస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ ఇంకా పెళ్ళి కూతురు రావట్లేదని ఎదురుచూస్తారు. ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళంతా వెళ్లిపోతుండగా.. కావ్యకి ముసుగువేసి కనకం తీసుకొస్తుంది. అప్పుడు రాజ్ కూల్ అయి పెళ్లి పీటలపై కూర్చుంటాడు. ఇక రాజ్ పిన్ని ముసుగుతో వచ్చిన కావ్యని చూసి.. "ఏంటి ఈ ముసుగు" అని అడుగుతుంది. ఇది మా ఇంటి ఆచారమని కనకం చెప్తుంది...

మురారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -94 లో.. మురారితో మాట్లాడుతుంటుంది ముకుంద. నీ అగ్రిమెంట్ భార్య ఈ మధ్య హద్దులు దాటుతుందని ముకుంద అనడంతో.. "హద్దులు అంటే ఏంటి" అని మురారి అడుగుతాడు. లిమిట్స్ అని ముకుంద చెప్తుంది. అవునా మరి లిమిట్స్ అంటే ఏంటి? మా శోభనం రోజున నువ్వు మా గది డోర్ కొట్టడమా అని మురారి అనేసరికి.. ముకుంద షాక్ అవుతుంది. "మాది అగ్రిమెంట్ మ్యారేజ్ కావచ్చు.. ఒకవేళ కృష్ణ వెళ్ళిపోయినా కూడా.. కృష్ణ నా భార్య అనే చెప్తాను. నేను తనకే సపోర్ట్ చేస్తాను" అని ముకుందకి వార్నింగ్ ఇస్తాడు మురారి...