English | Telugu
వాసంతి కృష్ణన్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ ఫ్రెండ్స్!
Updated : Mar 2, 2023
బిగ్ బాస్ లో గ్లామర్ కి కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచిన బ్యూటీ వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ సీజన్-6 లో తన అందంతో ఆకట్టుకొని అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ లోకి వచ్చిన ఈ గ్లామర్ క్వీన్ వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. ప్రస్తుతం బీబీ జోడీలో అర్జున్ కి జంటగా వాసంతి చేస్తూ.. తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్న జరిగిన వాసంతి పుట్టినరోజు వేడుకల్లో తనకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. రాజ్, అర్జున్, రోహిత్ -మెరీనా, టైటిల్ విన్నర్ రేవంత్, శ్రీసత్య, కీర్తిభట్, గీతూ అందరు కలిసి మిడ్‌నైట్ వాసంతికి సర్ ప్రైజ్ ఇచ్చారు. అందరిని ఒక్కసారిగా చూసిన వాసంతి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫ్రెండ్స్ అంతా కలిసి ఆమెను బయటకు తీసుకురాగా.. కార్ డిక్కీ ఓపెన్ చేసేసరికి బెలూన్స్ అన్నీ కూడా పైకి ఎగురుతాయి. అప్పుడు అందరు హ్యాపీ బర్త్ డే వాసంతి అంటూ విషెస్ చెప్పారు.
ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోని వాసంతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాగా వీళ్ళంతా కలిసి వాసంతి బర్త్ డే వేడుకల్లో కలిసారు. ఇలా అందరినీ ఒకేచోట చూసిన బిగ్ బాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్ షిప్ అంటే ఇదే, మళ్ళీ అందరిని ఒకే దగ్గర చూడటం బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం వాసంతి వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు"అనే సీరియల్ లో ముఖ్యమైన పాత్రలో చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇదే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటూ వస్తోంది వాసంతి.