English | Telugu

పెళ్ళిమండపం నుండి స్వప్న జంప్.. బాధలో కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -32లో.. స్వప్న పెళ్ళికి రెడీ అవుతూ.. అందరినీ వదిలి వెళ్లిపోతున్నాననే బాధతో కావ్య, అప్పులను పట్టుకొని ఏడుస్తుంది. నువ్వేం భయపడకు అక్కా.. నీకు నచ్చిన అతన్ని పెళ్ళి చేసుకుంటున్నావ్ అని కావ్య అంటుంది. అప్పు ఎలాగైనా బతికేస్తుంది.. నీ గురించే భయంగా ఉంది కావ్య.. చిన్నప్పటి నుండి నువ్వు మా కోసం కష్టపడుతున్నావని స్వప్న మనసులో అనుకుంటుంది. తను చీర మార్చుకుంటానని చెప్పి కావ్య, అప్పులను రూం నుండి బయటికి పంపించేసి.. స్వప్న వెనుక డోర్ నుండి పారిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ పెద్దమ్మ నగలు, చీరలు అన్నింటిని తన లగేజ్ లో సర్దుకొని లెటర్ రాసిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

మరోవైపు రాజ్ ఫ్యామిలీ వచ్చారని కనకం వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది.. ఇక రాజ్ పెళ్ళిపీటల మీద కూర్చొని ఉంటాడు. పెళ్లి కూతురుని తీసుకొని రండి అనగానే.. స్వప్నని తీసుకురావడానికి కనకం గదిలోకి వెళ్ళి చూసేసరికి స్వప్న లేకపోవడంతో.. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందనుకుంటూ కంగారుగా అంతా చూస్తుంది. అప్పుడే స్వప్న రాసిన లెటర్ ని చూసి.. దాన్ని చదువుతుంది. "అమ్మ నన్ను క్షమించు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నా గురించి వెతకొద్దు" అని స్వప్న ‌రాసిన లెటర్ లో ఉంటుంది. ఆ లెటర్ చదివిన కనకం "ఎంత పని చేసావే.. నువ్వు ఇష్టం అంటేనే కదా.. ఇన్ని అబద్ధాలు ఆడి నీ చెల్లెలు మాట, నీ నాన్న మాట వినకుండా ఇంత దూరం తీసుకొచ్చాను" అనుకుంటూ కనకం ఏడుస్తుంది. ఇక బ్రతకనని కనకం ఫ్యాన్ కి చీరతో ఉరేసుకుందామనుకుంటుంది. మరోవైపు ఇంకా పెళ్ళి కూతురు రావట్లేదని అందరూ అనుకుంటారు. అందరూ అలా అనడంతో.. మా అమ్మ ఇంకా రావట్లేదేంటి అని కావ్య అనుకొని గదిలోకి వెళ్తుంది. అక్కడ కావ్య వెళ్ళేసరికి కనకం ఉరేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అది చూసి కావ్య వెళ్ళి కనకంని ఆపుతుంది. అమ్మా.. ఏమైంది.. పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావని కావ్య అనగానే కనకం జరిగిందంతా చెప్తుంది.

మరోవైపు రాహుల్ కూడా పెళ్ళి మండపం నుండి ఎవరికి డౌట్ రాకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. స్వప్నని కార్ లో తీసుకొని వెళ్ళిపోతాడు. అలా స్వప్న కార్ లో వెళ్ళిపోతుండగా అప్పు ఫ్రెండ్ చూసి.. "మీ అక్క ఎవరి కార్ లోనో వెళ్తుంది" అని అప్పుతో చెప్తాడు. అలా చెప్పడంతో.. అప్పు పరుగున గదిలోకి వెళ్తుంది. అది విని.. "స్వప్న ముందే ప్లాన్ చేసుకుందే" అని కావ్య, అప్పులతో చెప్పుకుంటూ ఏడుస్తుంది కనకం. ఇక రాజ్ ఫ్యామిలీకి స్వప్న గురించి కనకం ఏం చెప్పనుంది? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.