English | Telugu

కలయో నిజమో తెలియకుండా ఉన్న మురారి!

స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-98 లో.. నందుకి వేసే టాబ్లెట్స్ ఓవర్ డోస్ అని, అవి వాడొద్దని కృష్ణ చెప్పగా.. ముకుంద అంతా తనకు తెలుసన్నట్లు మాట్లాడకు అని అంటుంది. నేను టాబ్లెట్స్ వేస్తానని భవాని ముందుకు వెళ్తుండగా కృష్ణ వద్దని అడ్డుపడుతుంది. "ఇంట్లో పెద్దత్తయ్య మాటకు ఎవరు ఎదురు తిరగరు. నువ్వు ఏంటి ఎదురు తిరుగుతున్నావు. మీ అత్తయ్యని ఒక్క మాట అన్నా నువ్వు ఒప్పుకోవు కదా. ఇప్పుడు నువ్వు పెద్దత్తయ్యని ఏం అన్నా నేను ఒప్పుకోను" అని ముకుంద అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న మురారి కల్పించుకొని కృష్ణ "ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఇప్పుడు జూనియర్ డాక్టర్ గా చేస్తుంది. కృష్ణకి బాగా తెలుసు.. ముకుంద నువ్వు నా భార్యను ఒక్క మాట అనడానికి వీలు లేదు" అని అందరి ముందే చెప్తాడు.

ఆ తర్వాత భవాని దగ్గరికి ఈశ్వర్, ప్రసాద్ ఇద్దరు వచ్చి.. నందు గురించి మాట్లాడుతారు. "వాలెంటైన్స్ డే రోజు నందు.. గతం గుర్తొచ్చినట్లు ప్రవర్తించేసరికి భయం వేసింది.. కృష్ణకి నందు గురించి తెలిస్తే మన కుటుంబం గుట్టు బయటపడుతుంది" అని ఈశ్వర్, ప్రసాద్ లు అనుకుంటారు. మరోవైపు రేవతి దగ్గరికి కృష్ణ వచ్చి.. అసలు నందు అలా అవడానికి కారణం ఏంటని అడుగుతుంది. రేవతికి ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఆలోచిస్తుంది. రేవతి మౌనంగా ఉండడంతో.. నందు గురించి చెప్పకూడని విషయం ఏమైనా ఉందా, నందూనే అడగాలని కృష్ణ తన మనసులో అనుకుంటుంది.

కృష్ణ ఆలోచనలతో మురారి కలలు కంటుంటాడు. కృష్ణ వచ్చి తనకు ప్రేమగా కాఫీ ఇచ్చినట్లుగా.. బుగ్గని తడిమి నిద్రలేపినట్లుగా ఉహించుకుంటాడు. సడన్ గా నిద్రలేచి చూసుకొని.. "నేను కల కన్నానా" అని అనుకుంటాడు. కాని కృష్ణ కాఫీతో నిజంగానే అక్కడికి వస్తుంది. కృష్ణ రావడం చూసిన మురారి అది తన కల అనుకొని సైలెంట్ గా ఉంటాడు. సర్ కాఫీ తీసుకోండని అనగానే.. "నా భ్రమ" అని మురారి అంటాడు. "భ్రమ కాదు సర్.. నిజమే" అని మురారి చేతిని గిల్లుతుంది కృష్ణ. కాసేపు సరదాగా ఇద్దరు ఆటపట్టించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.