English | Telugu

కవేళ అదే బతికి ఉంటే నేను దాన్నే నా పెట్ గా పెంచుకునేవాడిని

నిఖిల్ విజయేంద్ర సింహ యూట్యూబర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ గా బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేసాడు. అలాగే చాలా ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. "హలో వరల్డ్" అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఓటిటి ప్లాటుఫారం జీ5లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించింది. ఈ వెబ్ సిరీస్ కు నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్... నిఖిల్, నిహారిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. ఐతే నిఖిల్ ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తూ, వెరైటీ క్వశ్చన్స్ అడుగుతూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు.

సురేఖావాణి కూతురు సుప్రీతతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటాడు. అలాంటి నిఖిల్ ఒక పెట్ ని పెంచుకోవాలనుకుంటున్నాడు. సాధారణంగా ఎవరైనా కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో, కుందేలు పిల్లనో, చిలకనో పెంచుకోవాలనుకుంటారు. కానీ నిఖిల్ మాత్రం కొంచెం డిఫరెంట్ యానిమల్ ని పెంచుకోవాలని ఆశ పడుతున్నాడు. కానీ ఆ జీవులు మాత్రం ఇప్పుడు భూమి మీద బతికిలేవు...అవి ఏంటి అంటే డైనోసార్స్..."ఒక వేళ భూమి మీద ఈ జీవి బతికి ఉంటే దీన్నే నా పెట్ గా పెంచుకునేవాడిని" అని ఒక ఇమేజ్ ని ఈ కాప్షన్ కి పెట్టి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. ఇక నిఖిల్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేసరికి బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని అప్పట్లో ఒక టాపిక్ వైరల్ అయ్యింది. ఎందుకంటే బిగ్ బాస్ లోకి యూట్యూబర్స్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా షణ్ముఖ్ జశ్వంత్ , దీప్తి సునైనా, గీతూ రాయల్ కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.