English | Telugu
కృష్ణపై మురారి కేరింగ్.. అసూయతో రగిలిపోతున్న ముకుంద!
Updated : Mar 6, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -97 లో.. కృష్ణని తక్కువ చేసి ముకుంద మాట్లాడుతుందని మురారి వార్నింగ్ ఇచ్చాడు. కృష్ణ కాలేజికి వెళ్ళిరావడానికి.. కార్ తీసుకొని ఒక డ్రైవర్ ని పెడతానని కృష్ణకి సపోర్ట్ గా మురారి మాట్లాడతాడు. ఇక ఎక్కవ సేపు వాదిస్తే తన మీద ఉన్న కాస్త ప్రేమ కూడా పోతుందని భావించిన ముకుంద సైలెంట్ గా ఉంటుంది. కృష్ణని ఒక్క మాట కూడా అనడానికి వీలు లేదని మురారి చెప్పేసి వెళ్ళిపోతాడు.
మురారి తన గదిలోకి వెళ్ళేసరికి కృష్ణ పడుకొని ఉండడంతో.. జ్వరం వచ్చిందా అని చెయ్యి పట్టుకొని చూస్తాడు. జ్వరం ఏమి రాలేదు కదా ఎందుకు పడుకుందని కృష్ణని నిద్ర నుండి లేపుతాడు. భోజనం చేద్దాం పదా అని కృష్ణ తో అనేసరికి... "లేదు సర్.. నేను రాలేను. నీరసంగా ఉంది. ఈ ఇంట్లో ఇక్కడ మీతో ఉంటేనే నాకు నిశ్చింతగా ఉంటుంది. ఇంకెవరిని చూసినా భయంగా ఉంది. మీరు వెళ్ళి భోజనం చెయ్యండి" అని కృష్ణ అంటుంది. అలా కృష్ణ అనడంతో మురారి కిందకి వెళ్ళి కృష్ణ కోసం చపాతి తీసుకొని వస్తుంటాడు. అది చూసిన ముకుంద.. ఏంటి మురారి నీ భార్య కోసం భోజనం తీసుకెళ్తున్నావా? నిన్న జరిగిన దానికి కిందకి వచ్చి అందరికి తన మొహం చూపించలేకపోతుందా అని అంటుంది. "కృష్ణకి నీరసంగా ఉంది. అందుకే నేను తీసుకెళ్తున్నా" అని మురారి అంటాడు. అప్పుడే రేవతి వచ్చి.. "నేను భవాని అక్కకి చెప్తాను.. నువ్వు వెళ్ళి కృష్ణకి భోజనం ఇవ్వు" అని మురారి తో అంటుంది.
మురారి భోజనం తీసుకెళ్ళేసరికి కృష్ణ పడుకుంటుంది. "కృష్ణా.. మీ గౌతమ్ సార్ వచ్చాడు" అని మురారి అనగానే టక్కున లేచి కూర్చుంటుంది. చపాతి తిను కృష్ణ అని మురారి అనగా కృష్ణ వద్దంటుంది. ఆ తర్వాత మురారీనే ప్రేమగా తినిపిస్తాడు. నువ్వు నీ లక్ష్యం చేరుకోవడానికి ఇలాంటి కఠిన పరీక్షలు ఎదుర్కొనవలసి ఉంటుందని మురారి అంటాడు. ఆ తర్వాత కాసేపటికి ఇక నందు టాబ్లెట్లు వేసుకోనని మారం చేస్తూ కృష్ణా అని పిలవడంతో.. కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు నందుకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ టాబ్లెట్ ఎందుకు నందుకి వేస్తున్నారు డాక్టర్ వద్దని చెప్పాడు కదా అని కృష్ణ అంటుంది. "నువ్వు జూనియర్ డాక్టర్ వి మాత్రమే.. ఏదో కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ లాగా చెప్పకు" అని ముకుంద అనడంతో... నీకు తెలిసి తెలియక ఏం మాట్లాడకు ముకుంద అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.