English | Telugu

వాస్తు బాగుందని చెప్పి ఈ ఇల్లు ఇప్పించింది బ్రహ్మానందం గారే...

రచ్చ రవి బుల్లితెర కమెడియన్ గా నెమ్మదిగా ఎదుగుతూ ఒదుగుతూ అలా అలా సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రచ్చ రవి చేసిన మూవీస్ లో ఆయన క్యారక్టర్ కూడా బాగా హైలైట్ అవుతూ మంచి పేరునే సంపాదిస్తున్నాడు. ‘వన్స్‌మోర్‌ ప్లీజ్‌’ అనే వేదికపై తానేంటో నిరూపించుకుని ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు.  అలాంటి రచ్చ రవి తన అందమైన ఇంటిని అందులో తాను సంపాదించుకున్న అవార్డ్స్ ని కూడా చూపించాడు. తన ఇంట్లో ఒక షో కేసుగా కనిపించడానికి ఒక చెట్టును పళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. కష్టపడితే ప్రతిఫలం వస్తుంది అనే విషయాన్ని  లైవ్ గా తన పిల్లలకు చూపించాలంటే ఇదొక్కటే మార్గం అని దాన్ని ఏర్పాటు చేయించుకున్నాడట. ఆ చెట్టు కిందే కూర్చుని భోజనాలు చేస్తారని చెప్పుకొచ్చాడు. 

వారిద్దరి ప్లాన్ సక్సెస్.. తనని తీసుకెళ్ళలేదని దేవయాని ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -710లో.. దేవయాని తన భర్తతో.. అసలు వీళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు.. రాను రాను ఇంట్లో నేను అంటే గౌరవం లేకుండా పోయిందని అంటుంది. ఇంతలోనే రిషి, వసుధారలు సంతోషంగా హోలీ జరుపుకొని ఇంటికి అందరూ ఒకేసారి వస్తారు.. అలా ఒంటి మీద రంగులతో వచ్చిన అందరిని చూసి కోపంతో ఊగిపోతుంది దేవయాని. మీరంతా ఎక్కడికి వెళ్ళారని దేవయాని అడుగుతుంది. అప్పుడు వసుధార వచ్చి దేవయానిని హాగ్ చేసుకొని హ్యాపీ హోలీ అని చెప్తుంది. హోలీ జరుపుకొని వస్తున్నాం పెద్దమ్మ.. నాకు చాలా హ్యాపీ గా ఉందంటూ దేవయానితో రిషి చెప్తాడు. మరి మాకెందుకు చెప్పలేదు. చెప్తే మేం కూడా వచ్చేవాళ్ళం కదా అని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత కాసేపటికి స్వీట్ చేసి తీసుకొస్తాను అని వసుధార అంటుంది...