English | Telugu

బ్రహ్మముడి పడింది.. ఇష్టం లేకుండానే ఒక్కటైన రాజ్-కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. గత వారం రోజులుగా రాజ్ పెళ్ళి ఎవరితోనా అనే‌ సస్పెన్స్ కి తెరపడింది. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -37 లో.. పెళ్లి పందింట్లో కావ్యను పెళ్లి చేసుకోనని రాజ్ తెగేసి చెప్పి తన ఫ్యామిలీతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోతుంటే.. ఆ షాక్ తో కనకం కిందపడిపోతుంది. అది చూసి ఏమైందని రాజ్ ఫ్యామిలీ వాళ్ళు ఆగిపోతారు. రాజ్ ఫ్యామిలీ వాళ్ళు డాక్టర్ ని పిలిపించి కనకంకి ఏమైందని చూస్తారు. కనకంని చూసిన‌ డాక్టర్.. బీపి ఎక్కువ అయి ఇలా కిందపడిపోయింది. ఈమెను ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని చెప్తాడు. కనకం కళ్ళు తెరిచాక మళ్ళీ నా కూతురుని పెళ్లి చేసుకోండి బాబు అని రాజ్ తో చెప్తుంది. నేను చేసిన తప్పుకి నా కూతురికి శిక్ష పడొద్దని రాజ్ ఫ్యామీలీని బ్రతిమిలాడుతుంది కనకం.

రాజ్ వాళ్ళ తాతయ్య దగ్గరికి కృష్ణమూర్తి వెళ్ళి.. తప్పు అంతా మాదే.. మీరు గొప్పోళ్ళు.. మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండని అంటాడు. అలా అనగానే రాజ్ వాళ్ళ తాతయ్య ఆలోచనలో పడతాడు. రాజ్ బయట మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ.. "ఒక అమ్మాయి డ్రామా చేస్తుంది. నన్ను బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది" అని చెప్తాడు. మీడియా వాళ్ళు మీరు పెళ్ళి చేసుకోవాలని చెప్తారు. అది కుదరదంటూ రాజ్ గట్టిగా చెప్తాడు. ఇక రాజ్ తాతయ్య రాజ్ తో.. "ఈ పెళ్ళి ఆగిపోతే మనం ఒక అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మనకు లేదు. మనమేదో తప్పు చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ పెళ్ళి ఆగిపోతే మన పరువు పోతుంది. నువ్వు అలోచించి నిర్ణయం తీసుకో రాజ్" అని వాళ్ళ తాతయ్య చెప్తాడు. దాంతో రాజ్ ఆలోచనలో పడతాడు.

మరోవైపు కావ్య నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తుంది. ఇంతలో రాజ్ వచ్చి.. నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కనకం, కృష్ణమూర్తి కలిసి కావ్యను పెళ్ళికి ఒప్పిస్తారు. కావ్య కూడా సరే అనడంతో కనకం సంతోషిస్తుంది. ఇక రాజ్ కావ్యలకి పెళ్ళి అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీకి ఇష్టంలేని అమ్మాయి.. ఆ ఇంటి కోడలు అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.