English | Telugu

 మా నానమ్మ ఎలా వంట చేస్తోందో చూడండి...

ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే ఆ ముచ్చటే వేరుంటది కదా. అంత వయసులోనూ మనవాళ్లకు, మనవరాళ్లకు వండి పెడితే వాళ్లకు ఆనందం వస్తుంది. వాళ్ళ చేతి వంట తిని మనకు ఆరోగ్యం కూడా వస్తుంది. ఐతే ఎవరింట్లో బామ్మలు ఇప్పటికీ పని చేస్తున్నారో లేదో తెలీదు కానీ విష్ణుప్రియ ఇంట్లో మాత్రం వాళ్ళ బామ్మ శ్రద్దగా వంట చేస్తూ కనిపించింది. ఆమె పనిలో మునిగిపోయేసరికి తెలియకుండా ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "మా నానమ్మ..వయసు 79 . నాకోసం ఎంతో శ్రద్దగా, ప్రేమతో చాలా డెడికేటెడ్ గా వంట చేస్తోంది చూడండి" అని కాప్షన్ పెట్టింది. విష్ణుప్రియ ఒక యూట్యూబర్‌గా తన కెరీర్‌ ని స్టార్ట్ చేసింది.

"పోవే పోరా" షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన హంగామా ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేరు. ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. రీసెంట్ గా రిలీజ్ ఐన "వాంటెడ్ పండుగాడు" మూవీలో ఓ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఐతే ఆమె జీవితంలో రీసెంట్ గా ఒక విషాదం చోటుచేసుకుంది. ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఆ విషయాన్ని విష్ణు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేసుకుని చాలా బాధపడింది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అప్పుడప్పుడు అందాల విందు చేస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.