English | Telugu

రిషి సార్ కి నా మీద ప్రేమ ఎక్కువే.. మురిసిపోయిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -704 లో.. మినిస్టర్ రిషికి కాల్ చేసి "మీడియాలో వసుధార భర్త మీరేనని చెప్పింది చూసాను. చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్" అని చెప్పి రిషి, వసుధారలను వాళ్ళింటికి భోజనానికి ఆహ్వానించాడు.

మరోవైపు స్టూడెంట్స్ ఇచ్చిన వసుధార-రిషీల ఫోటో గ్రీటింగ్ ను పట్టుకొని వసుధార క్యాబిన్ కి జగతి, మహేంద్ర వెళ్తారు. ఆ గ్రీటింగ్ ని వాల్ కి అంటిస్తుండగా సడన్ గా రిషి వచ్చేసరికి తడబడుతారు. అది చూసిన రిషి.. "ఏంటి డాడ్" అని అడుగుతాడు. ఏమో మాకేం తెలియదని వాటిని తీసేస్తుంటాడు మహేంద్ర.. ఆ గ్రీటింగ్స్ ను రిషి చూసి.. "డాడ్.. పర్లేదు ఉండనివ్వండి.. స్టూడెంట్స్ అభిమానంతో ఇస్తే వాటిని తీసుకోవాలి" అని చెప్పి వెళ్ళిపోతాడు. రిషికి కోపం ఎంతనో ప్రేమ‌ కూడా అంతే కదా జగతి అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు బయటకు వెళ్తుండగా అక్కడే ఉన్న రిషి.. వసుధార ఎందుకు రాలేదని జగతిని అడుగుతాడు. ఏమో రిషి నాకేం చెప్పలేదని జగతి అంటుంది. అలా తను అనగానే ఫోన్ చేసి కనుక్కోమని చెప్తాడు రిషి. దాంతో జగతి, వసుధారకి ఫోన్ చేసి.. "ఎందుకు రాలేదు ఎప్పటివరకు రావు" అని అడుగుతుంది. ఈ రోజు రాను.. నా వర్క్ పూర్తిగా అయ్యాక వస్తానని వసుధార అనగానే.. రిషి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా రిషి వెళ్ళిపోయాక వసుధారకి జగతి జరిగిందంతా చెప్తుంది. "ఏంటి వసు.. రావట్లేదని రిషీకి ఒక్క మాట చెప్పొచ్చు కదా.. రిషి ఎన్నిసార్లు అడిగాడో తెలుసా" అని జగతి అంటుంది. దాంతో రిషి సర్ కి నా మీద ప్రేమ ఎక్కువేనని మురిసిపోతుంది వసుధార.

ఆ తర్వాత రిషి మినిస్టర్ గారింటికి ప్లాన్ ఫిక్స్ చేసి వసుధార దగ్గరికి వస్తాడు. రిషి వచ్చాడని వసుధార పరుగున బయటికి వెళ్తుంది. అలా పరుగెత్తుకుంటూ వస్తుండగా.. వసుధార పడిపోతుంటుంది. వెంటనే రిషి పట్టుకొని.. నడుస్తూ రావొచ్చు కదా పరిగెత్తుకు రావాలా అని అంటాడు. ఆ తర్వాత కాసేపటికి రిషికి టీ ఇచ్చి, వసుధార రెడీ అవుతుంది. మరోవైపు వసుధార, రిషిల మధ్య ఏం జరుగుతుందని దేవయాని ఆలోచిస్తుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.