English | Telugu
పట్టుకుంటే గిఫ్ట్ అంటున్న సుమ!
Updated : Mar 7, 2023
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ కనకాల. దాదాపుగా ప్రతి ఈవెంట్ లో, ఆడియో ఫంక్షన్ లో సుమ యాంకరింగ్ చేయాల్సిందే. ఎంత మందిలో ఉన్న తడబడకుండా సునాయాసంగా మాట్లాడుతూ మంచి కామెడి టైమింగ్ తో సుమ నవ్వులు పూయిస్తుంది. క్షణం తీరిక లేని బిజీ లైఫ్ సుమది. పుట్టింది కేరళ అయిన తెలుగు బడిలో ఓనమాలు దిద్ధినట్లుగా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది సుమ. తనకున్న బిజీ లైఫ్ లో కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తోంది.
తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా ఉమెన్స్ కి సర్ ప్రైజ్ ఉందంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో లైవ్ ఉంటుందని తెలిపింది. 'పట్టుకుంటే గిఫ్ట్ 'అంటూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు లైవ్ లోకి వచ్చేస్తోంది సుమ. ఎప్పుడు ఉమెన్స్ కి సపోర్ట్ ఇస్తూ తన కెరీర్ లో ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చేసింది. ప్రతి మహిళ సుమని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. తాజాగా సుమ.. 'యూట్యూబ్ లైవ్.. పట్టుకుంటే గిఫ్ట్' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేయగా.. అది చూసిన తన ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. మహిళలు కూడా హ్యఫీగా ఫీల్ అవుతున్నారు.
ఇప్పుడు సెలబ్రిటీలందరు తాము చేసే పనులు ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సుమ కూడా అదేబాటలోకి చేరింది. అయితే ఎప్పుడు బిజీగా ఉండే సుమ ఇటీవల తను చిన్నతనంలో చదువుకున్న స్కూల్ కి వెళ్ళి బాల్యంలో గడిపిన జ్ఞాపకాలన్నింటిని గుర్తు చేసుకుంటూ.. ఒక వీడియో చేసింది. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా.. దానికి విశేష స్పందన లభించింది. ఆ తర్వాత వీడియో వైరల్ గా మారింది. మహిళా దినోత్సవం రోజు సుమ ప్లాన్ చేసిన ఈ యూట్యూబ్ లైవ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. మహిళలకు ఏమైనా టిప్స్ ఇస్తుందో? లేక తన బిజినెస్ ఆలోచనలను ఏమైనా షేర్ చేసుకుంటుందో చూడాలి మరి.