English | Telugu

నిజంగా నువ్వు కుక్కవే... కన్నీళ్లు పెట్టుకున్న శ్రీసత్య

బిగ్ బాస్ లో ఉన్నంతకాలం అర్జున్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్. కానీ బీబీ జాడీలో మాత్రం తన మీద ఉన్న ఎన్నో నెగటివ్ కామెంట్స్ కి తెర దించేలా చేసాడు తన వెరైటీ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో. తన జోడి వాసంతి కృష్ణన్ తో కలిసి వేరే లెవెల్ డాన్స్ చేస్తూ తన గ్రాఫ్ ని పెంచుకుంటున్నాడు. ఇక బీబీ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అర్జున్ కళ్యాణ్ డాన్స్ కానీ ఎమోషన్స్ కానీ పీక్స్ అని చెప్పొచ్చు. కేరాఫ్ కంచరపాలెం మూవీలోని "ఆశాపాశం" సాంగ్ ని ఎంచుకుంది ఈ జోడి. ఈ సాంగ్ లో భాగంగా కుక్కగా నటించాడు అర్జున్ కళ్యాణ్. "ఈ పెర్ఫామెన్స్‌లో నేను నమ్మాను.. నిజంగా మీరు ఒక కుక్క అని" అంటూ సదా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది. అర్జున్ కళ్యాణ్ కుక్కలా నటిస్తూ.. కుక్క ఎలాగైతే కాళ్లు నాకుతుందో అలా.. ‘వాసంతి కాళ్లు నాకుతూ’ అచ్చంగా కుక్క పాత్రలో జీవించేశాడు అర్జున్ కళ్యాణ్.

ఆ టైములో శ్రీసత్య తెగ ఏడ్చేసింది. "ఒక మనిషి కుక్కపై ఎంత ప్రేమ చూపిస్తుందో అలా నువ్వు చేసి చూపించేశావ్ రా" అంటూ జడ్జి రాధ కూడా చెబుతూ ఏడ్చేసింది. " నా లైఫ్ లో ఎన్నో సాంగ్స్ కి జడ్జిగా చేసాను కానీ ఇటువంటి సాంగ్ నేను ఇంతవరకు చూడలేదు" అని ఎమోషనల్ అయ్యారు తరుణ్ మాస్టర్. ఇంతలో "కాంపిటీషన్ చూడాలా ఎమోషన్స్ చూడాలా..నాకర్థం కాలేదు" అంటూ ఆరియానా డైలాగ్స్ తో రెచ్చిపోయింది. "డాగ్ ఏమీ చెప్పుకోలేదు" కదా అని వాసంతి చెప్పే ప్రయత్నం చేసేలోపే "వాసంతి నువ్వు మాట్లాడుతున్నది చాలా తప్పు" అని అవినాష్ కూడా రెచ్చిపోయాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.