English | Telugu
బల్లులు నాకేనా అందంగా కనిపించేవి?
Updated : Mar 6, 2023
బిగ్ బాస్ అన్ని సీజన్స్ కంటే కూడా సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ వలన మస్త్ ఫేమస్ అయ్యింది. గీతూ ఎలిమినేట్ ఐనప్పుడు ఆ ఇంటిని విడిచి రాలేక భోరున ఏడ్చేసింది. గీతూ బిగ్ బాస్ కి వెళ్ళకముందు యూట్యూబ్ లో రివ్యూయర్ గా వీడియోస్ అప్ లోడ్ చేసి ఫేమస్ అయ్యింది. అలా పాపులారిటీ తెచ్చుకున్న గీతు రాయల్ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో కూడా కనిపించి వావ్ అనిపించారు. ఐతే మరీ అంత ఫేమస్ కాదు.
కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక మాత్రం పిచ్చ పాపులారిటీ సంపాదించేసుకుంది. చిత్తూర్ చిరుత అని అనిపించుకుంది...అలాగే ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఎంతో మంది అమ్మాయిలూ ఉన్నారు. గీతూ ఈ పని చేసినా ఏ విషయం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిజ జీవిత విషయాలను చెబుతూ మోటివేషనల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గీతూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వెరైటీ వీడియో పోస్ట్ చేసింది. ఒక బల్లి మనిషి వేలును పట్టుకుని కోరుకుతున్నట్టుగా ఉంటుంది. ఆ వీడియోకి "ఈ ప్రపంచంలో బల్లులు అందమైనవిగా కనిపించేది నాకు మాత్రమేనా...మీకు అలా ఎప్పుడైనా అందంగా కనిపించాయా ? " అని అడిగింది. దీన్ని బట్టి గీతూకి బల్లులంటే ఇష్టం అన్న విషయం అర్థమౌతోంది. ఇక గీతూ వాళ్ళ నాన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోస్ అలాగే గీతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేసి తనను మోటివేట్ చేసిన వీడియో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.