English | Telugu
వసుధారని కౌగిలించుకొని మన మధ్య బంధం.. దూరం.. ఇదేనని చెప్పిన రిషి!
Updated : Mar 6, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -703 లో.. రిషి దగ్గరకి జగతి వెళ్ళి వసుధార గురించి మాట్లాడుతుంది. వసుధారకి ఇవ్వమని తాళిని నీతో నేనే పంపించాను. ఆ విషయం నీకు తెలియదు. ఆ తాళిని నువ్వు కట్టినట్టుగా భావించి తన మెడలో వేసుకుంది. వసుధారని అర్థం చేసుకోమని రిషీతో అంటుంది జగతి. నీ పర్మిషన్ లేకుండా మీడియా ముందు అలా చెప్పానని జగతి అనగానే.. "ఏం పర్లేదు మేడం. మీరు చేసింది తప్పని నేను అనట్లేదుగా" అని రిషి అంటాడు. నేను చెప్పింది తప్పు కానప్పుడు వసుధార చేసింది కూడా తప్పు కాదు కదా రిషి అని జగతి ప్రశ్నించగా.. కొన్ని తప్పులని క్షమించలేము అని రిషి సమాధానమిస్తాడు. అలా అనగానే కొన్ని బాధలని అందరూ భరించలేరు.. దయచేసి నా పరిస్థితి వసుధారకి రానివ్వకు రిషి అని జగతి అంటుంది. ఆ తర్వాత రిషి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
వసుధార రిషి ఆలోచనలో ఉండిపోతుంది. రిషికి కాల్ చెయ్యాలా? లేదా? అని అనుకుంటూ వాళ్ళ ఇంటి డోర్ వేస్తుండగా అక్కడ గుమ్మం బయట రిషి ఉంటాడు. లోపలికి వచ్చిన రిషి.. నాకు తలనొప్పిగా ఉంది వసుధార.. నీ చేతి కాఫీ తాగుదామని వచ్చాను అనగా.. సరే అని వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది వసుధార. "నాకు పొగరు.. ఇగో ఉన్నాయని అనుకుంటున్నారా సర్.. అవును ఉన్నాయి నిజమే కాని.. అవి మీ ముందు కాదు.. మనిద్దరం ఒకటే సర్" అని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషి కాఫీ తాగి వెళ్తుండగా.. సర్ ఏదో మాట్లాడాలని వచ్చి వెళ్లిపోతున్నారని వసుధార అంటుంది. అప్పుడే జగతి మాటలను రిషి గుర్తు చేసుకొని వసుధారని ఒక్కసారిగా హత్తుకుంటాడు. ఇక రిషి వెళ్ళిపోతూ.. "ఇదే మన బంధం.. ఇదే మన దూరం"అని వెళ్ళిపోతాడు.
మరోవైపు కాలేజీకి వెళ్ళిన రిషికి విషెస్ చెప్పడానికి స్టూడెంట్స్ అందరూ ఎదురుచూస్తుంటారు. మహేంద్ర, జగతి, రిషి కాలేజీకి వెళ్ళగానే.. కంగ్రాట్స్ సర్.. వసుధార మేడం రాలేదా? అని స్టూడెంట్స్ అడగగా.. వాళ్ళకి సమాధానం చెప్పకుండానే రిషి వెళ్ళిపోతాడు. రిషి తన క్యాబిన్ లో కూర్చొని.. వసుధార ఇంకా కాలేజీకి రాలేదా అని ఆలోచిస్తుంటాడు. రిషి, వసుధారలకు మినిస్టర్ గారు కాల్ చేసి వాళ్ళింటికి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.