English | Telugu

చపాతీ విత్ ఐస్ క్యూబ్స్..గులాబ్ జామున్ విత్ పప్పు..కిచెన్ థీమ్ లో సూపర్ క్వీన్స్

సూపర్ క్వీన్ షో ప్రతీ వారం వెరైటీ కాన్సెప్ట్స్ చేస్తూ ఆడియన్స్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది . లాస్ట్  వీక్ సూపర్ క్వీన్స్ కాస్తా సూపర్ కింగ్స్ లా వచ్చారు. ఇక నెక్స్ట్ వీక్ ఈ సూపర్ క్వీన్స్ అంతా "కిచెన్ థీమ్" రౌండ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో వంటలు చూస్తే వాటిని అస్సలు తినబుద్దే కాదు..అలాంటి వెరైటీస్ చేసేసరికి హోస్ట్ ప్రదీప్ కూడా షాకయ్యాడు. "అయ్యయ్యో ..నేను ఏం చూడకూడదు అనుకున్నానో మీరు అవే మీ చేతుల్లో తీసుకొచ్చారు" అని తెగ ఫీలైపోయాడు ప్రదీప్.

ఆదికి పరువు లేదన్న సిరి...సోదాపి వెళ్ళమన్న ఆది

ఈ వారం ఢీ ప్రీమియర్ లీగ్ లో టీమ్స్ ని రిప్రెజంట్ చేయడానికి వచ్చిన సిరి హన్మంత్, మధు ప్రియా, హరితేజ మీద కౌంటర్ లు పేల్చాడు ఆది. "ఏమిటి మనది వైజాగా" అని శేఖర్ మాష్టర్ సిరిని అడిగేసరికి "ఏమనుకున్నారు మాష్టర్ మరి ..మా దగ్గర ఒడియమ్మ అనేది ఊత పదం" అని  సిరి  చెప్పేసరికి ఆది తన ఫోన్ లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ "సిరి సోదాపి పాయింట్ కి రా" అని కౌంటర్ వేసాడు. దానికి ప్రదీప్, దీపికా ఇద్దరూ కలిసి "నీ దగ్గర ఉన్నది ఆండ్రాయిడ్..అందులో సిరి ఉండదు...ఐ ఫోన్ లో ఉంటుంది" అని అన్నారు.."ఇది ఐఫోన్ రా " అని ఆది క్లారిటీ ఇచ్చేసరికి "ఆది అది ఐఫోన్ కాదు నీ ఫోన్" అంది రివర్స్ కౌంటర్ వేసింది సిరి.

వెళ్లి ఆస్కార్ తెచ్చుకుంటా...యమదొంగ మూవీలో నటించింది రాఘవేంద్రరావు గారు

"ఆలీతో ఆల్ ఇన్ వన్ " ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి రోల్ రైడా, ఫైమా, యాదమ్మ రాజు వచ్చారు.."నీ ఒరిజినల్ పేరేమిటి" అని రోల్ రైడాని అడిగారు ఆలీ. "ఎప్పుడూ చెప్పలేదు" అన్నాడు రోల్ రైడా..ఆల్రెడీ "రోల్ ఆర్..రైడా ఆర్" అని ఆలీ అనేసరికి "ఇంకొక ఆర్ వేస్తే ట్రిపుల్ ఆర్ ఐపోతుంది ఆస్కార్ కూడా తెచ్చేసుకుంటా" అని రైడా అనేసరికి "ఆస్కార్ ఇవ్వరు కానీ భాస్కర్ ఐతే ఇస్తారు" అన్నారు ఆలీ. తర్వాత సెట్ లోకి ఫైమా వచ్చింది. "లేటెస్ట్ నేమ్ ఫైమా అని ఎవరిని ఉద్దేశించి పెట్టారు మీ నాన్నగారు" అని ఆలీ అడిగారు. "ఊరికే ఫైవ్ రూపీస్ ఇయ్యమ్మ ఇయ్యమా అంటే ఫైమా అని పెట్టేసారు" అని ఫన్నీగా చెప్పింది ఫైమా. తర్వాత సెట్ లోకి యాదమ్మ రాజు వచ్చాడు. "ఎంతమంది మొత్తం మీ ఫామిలీ" అని అడిగేసరికి "నలుగురం సర్ ..నేనే పెద్దా" అన్నారు రాజు. "కానీ పొట్టిరాయుడివి" అని కామెంట్ చేశారు ఆలీ.

దీపను చాలా మిస్ అవుతూ ఉంటా..మోనిత అప్ డేట్స్ పెడుతూనే ఉంటుంది

తెలంగాణలో బోనాలు మొదలైన సందర్భంగా స్టార్ మావాళ్ళు "మా బోనాల జాతర" పేరుతో ఒక షో ప్లాన్ చేసింది..జులై 2 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కాబోతోంది. ఇందులో చాలామంది సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు.  డాక్టర్ బాబు, దీప, మోనిత మాత్రం ఫామిలీ ప్యాకేజీలా వచ్చారు. హోస్ట్స్ గా వర్షిణి, రవి ఉన్నారు. "డాక్టర్ బాబు కార్తీక దీపం సీరియల్ ఐపోయాక మీరు ఎవరిని బాగా మిస్ అవుతున్నారు" అని వర్షిణి అడిగేసరికి "మోనిత సోషల్ మీడియాలో అప్ డేట్స్ అవీ పెడుతూనే ఉంటుంది ..కానీ దీప మాత్రం అప్ డేట్స్ ఏవీ సోషల్ మీడియాలో పెట్టదు..అందుకే నేను ఎక్కువగా దీపను మిస్ అవుతాను" అని డాక్టర్ బాబు చెప్పేసరికి దీప చాలా ఖుషీ ఐపోయింది.

తొక్కలో పిల్లి అన్న ఆది..నాలాంటి అమ్మాయి దక్కాలంటే యుద్దాలు చేయాలన్న దీపికా

ఢీ ప్రీమియర్ లీగ్ ఈ వారం  స్టైలిష్ కొరియోగ్రాఫర్స్ వచ్చి అద్దిరిపోయే పెర్ఫార్మెన్సెస్ చేసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ వీక్ నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు టీమ్ లు వచ్చి తమ సత్తా చూపించాయి.  ఈ వారం మరో నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు టీమ్ లు వచ్చాయి. అందులోంచి సాయి మాస్టర్ టీం "కోనసీమ పందెం కోళ్లు" పేరుతో వచ్చారు. వీళ్ళ టీంని  రిప్రెజంట్ చేయడానికి గెటప్ శీను వచ్చాడు. తర్వాత  సందీప్ మాస్టర్ టీం "వాల్తేర్ వారియర్స్" పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళను రిప్రెజంట్ చేయడానికి సిరి హన్మంత్ వచ్చింది.

విడాకులు కోరిన స్టెల్లా..గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలంటూ కండిషన్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా కొత్తగా డిజైన్ చేశారు మేకర్స్. రావడం రావడమే విడాకుల అంశం మీద ఫోకస్ చేశారు యాదమ్మ రాజు-స్టెల్లా జంట. "ఫోన్ చూపించు నీది" అని రాజుని అడిగింది స్టెల్లా..."ఏంటి పాస్వర్డ్ పెట్టావ్..నేను యూఎస్ కి వెళ్లే ముందు సెల్ కి పాస్వర్డ్ లేదు...కానీ ఇప్పుడు పాస్వర్డ్ పెట్టావ్..నువ్వు తప్పు చేస్తున్నావ్..నాకు విడాకులు కావాలి" అని స్టెల్లా అనేసరికి తనకు కూడా విడాకులు కావాలని సెల్ ని కిందకి విసిరేసాడు రాజు. " పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసుకున్నావో విడాకులు కూడా అంతే గ్రాండ్ గా కావాలి" అని అడిగింది స్టెల్లా...ఇలా ఈ వారం షో విడాకుల టాపిక్ మీద రాబోతోందని అర్ధమవుతోంది.

నావికా సాగర్ పరిక్రమలో ఈ గ్లోబ్ మొత్తం చుట్టి వచ్చా..

  ఈ వారం సూపర్ క్వీన్స్ షో మాత్రం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఈ షోలో సూపర్ క్వీన్స్ అంతా కూడా కింగ్స్ వేషధారణలో వచ్చి ఎంటర్టైన్ చేశారు. లిఖిత.. పుష్పరాజ్ గెటప్ లో, సుష్మిత.. ధరణి మేకప్ తో, ప్రియాంక ..నారప్పలా, కండక్టర్ ఝాన్సీ.. భీమ్లా నాయక్ లా, మౌనిక ..ఖైదీ మూవీలో ఢిల్లీ గెటప్ లో, ఎస్తేర్.. రోలెక్స్ లా, విద్యుల్లేఖ.. కొమరంభీంలా,  ప్రశాంతి.. డీజే టిల్లు గెటప్ తో,  సుహాసిని.. బాహుబలిలా,  పవిత్ర.. అఖండ గెటప్ లో వచ్చారు. వీళ్లకు ఎన్నో రకాల ఫిజికల్ టాస్కులు ఇచ్చి ఆడించాడు ప్రదీప్.  ఇక ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా నేవీలో లెఫ్ట్నెంట్ కమాండర్ గా ఉన్న ఐశ్వర్య గారిని ఇన్వైట్ చేసాడు. "మీరు ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది.