English | Telugu

వెళ్లి ఆస్కార్ తెచ్చుకుంటా...యమదొంగ మూవీలో నటించింది రాఘవేంద్రరావు గారు

"ఆలీతో ఆల్ ఇన్ వన్ " ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి రోల్ రైడా, ఫైమా, యాదమ్మ రాజు వచ్చారు.."నీ ఒరిజినల్ పేరేమిటి" అని రోల్ రైడాని అడిగారు ఆలీ. "ఎప్పుడూ చెప్పలేదు" అన్నాడు రోల్ రైడా..ఆల్రెడీ "రోల్ ఆర్..రైడా ఆర్" అని ఆలీ అనేసరికి "ఇంకొక ఆర్ వేస్తే ట్రిపుల్ ఆర్ ఐపోతుంది ఆస్కార్ కూడా తెచ్చేసుకుంటా" అని రైడా అనేసరికి "ఆస్కార్ ఇవ్వరు కానీ భాస్కర్ ఐతే ఇస్తారు" అన్నారు ఆలీ. తర్వాత సెట్ లోకి ఫైమా వచ్చింది. "లేటెస్ట్ నేమ్ ఫైమా అని ఎవరిని ఉద్దేశించి పెట్టారు మీ నాన్నగారు" అని ఆలీ అడిగారు. "ఊరికే ఫైవ్ రూపీస్ ఇయ్యమ్మ ఇయ్యమా అంటే ఫైమా అని పెట్టేసారు" అని ఫన్నీగా చెప్పింది ఫైమా. తర్వాత సెట్ లోకి యాదమ్మ రాజు వచ్చాడు. "ఎంతమంది మొత్తం మీ ఫామిలీ" అని అడిగేసరికి "నలుగురం సర్ ..నేనే పెద్దా" అన్నారు రాజు. "కానీ పొట్టిరాయుడివి" అని కామెంట్ చేశారు ఆలీ.

దీపను చాలా మిస్ అవుతూ ఉంటా..మోనిత అప్ డేట్స్ పెడుతూనే ఉంటుంది

తెలంగాణలో బోనాలు మొదలైన సందర్భంగా స్టార్ మావాళ్ళు "మా బోనాల జాతర" పేరుతో ఒక షో ప్లాన్ చేసింది..జులై 2 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కాబోతోంది. ఇందులో చాలామంది సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు.  డాక్టర్ బాబు, దీప, మోనిత మాత్రం ఫామిలీ ప్యాకేజీలా వచ్చారు. హోస్ట్స్ గా వర్షిణి, రవి ఉన్నారు. "డాక్టర్ బాబు కార్తీక దీపం సీరియల్ ఐపోయాక మీరు ఎవరిని బాగా మిస్ అవుతున్నారు" అని వర్షిణి అడిగేసరికి "మోనిత సోషల్ మీడియాలో అప్ డేట్స్ అవీ పెడుతూనే ఉంటుంది ..కానీ దీప మాత్రం అప్ డేట్స్ ఏవీ సోషల్ మీడియాలో పెట్టదు..అందుకే నేను ఎక్కువగా దీపను మిస్ అవుతాను" అని డాక్టర్ బాబు చెప్పేసరికి దీప చాలా ఖుషీ ఐపోయింది.

తొక్కలో పిల్లి అన్న ఆది..నాలాంటి అమ్మాయి దక్కాలంటే యుద్దాలు చేయాలన్న దీపికా

ఢీ ప్రీమియర్ లీగ్ ఈ వారం  స్టైలిష్ కొరియోగ్రాఫర్స్ వచ్చి అద్దిరిపోయే పెర్ఫార్మెన్సెస్ చేసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ వీక్ నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు టీమ్ లు వచ్చి తమ సత్తా చూపించాయి.  ఈ వారం మరో నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు టీమ్ లు వచ్చాయి. అందులోంచి సాయి మాస్టర్ టీం "కోనసీమ పందెం కోళ్లు" పేరుతో వచ్చారు. వీళ్ళ టీంని  రిప్రెజంట్ చేయడానికి గెటప్ శీను వచ్చాడు. తర్వాత  సందీప్ మాస్టర్ టీం "వాల్తేర్ వారియర్స్" పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళను రిప్రెజంట్ చేయడానికి సిరి హన్మంత్ వచ్చింది.

విడాకులు కోరిన స్టెల్లా..గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలంటూ కండిషన్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా కొత్తగా డిజైన్ చేశారు మేకర్స్. రావడం రావడమే విడాకుల అంశం మీద ఫోకస్ చేశారు యాదమ్మ రాజు-స్టెల్లా జంట. "ఫోన్ చూపించు నీది" అని రాజుని అడిగింది స్టెల్లా..."ఏంటి పాస్వర్డ్ పెట్టావ్..నేను యూఎస్ కి వెళ్లే ముందు సెల్ కి పాస్వర్డ్ లేదు...కానీ ఇప్పుడు పాస్వర్డ్ పెట్టావ్..నువ్వు తప్పు చేస్తున్నావ్..నాకు విడాకులు కావాలి" అని స్టెల్లా అనేసరికి తనకు కూడా విడాకులు కావాలని సెల్ ని కిందకి విసిరేసాడు రాజు. " పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసుకున్నావో విడాకులు కూడా అంతే గ్రాండ్ గా కావాలి" అని అడిగింది స్టెల్లా...ఇలా ఈ వారం షో విడాకుల టాపిక్ మీద రాబోతోందని అర్ధమవుతోంది.

నావికా సాగర్ పరిక్రమలో ఈ గ్లోబ్ మొత్తం చుట్టి వచ్చా..

  ఈ వారం సూపర్ క్వీన్స్ షో మాత్రం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఈ షోలో సూపర్ క్వీన్స్ అంతా కూడా కింగ్స్ వేషధారణలో వచ్చి ఎంటర్టైన్ చేశారు. లిఖిత.. పుష్పరాజ్ గెటప్ లో, సుష్మిత.. ధరణి మేకప్ తో, ప్రియాంక ..నారప్పలా, కండక్టర్ ఝాన్సీ.. భీమ్లా నాయక్ లా, మౌనిక ..ఖైదీ మూవీలో ఢిల్లీ గెటప్ లో, ఎస్తేర్.. రోలెక్స్ లా, విద్యుల్లేఖ.. కొమరంభీంలా,  ప్రశాంతి.. డీజే టిల్లు గెటప్ తో,  సుహాసిని.. బాహుబలిలా,  పవిత్ర.. అఖండ గెటప్ లో వచ్చారు. వీళ్లకు ఎన్నో రకాల ఫిజికల్ టాస్కులు ఇచ్చి ఆడించాడు ప్రదీప్.  ఇక ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా నేవీలో లెఫ్ట్నెంట్ కమాండర్ గా ఉన్న ఐశ్వర్య గారిని ఇన్వైట్ చేసాడు. "మీరు ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది.

రిషి గురించి తెలుసుకున్న మహేంద్ర.. ప్రాణాపాయ స్థితిలో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-800లో.. చక్రపాణి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా మహేంద్ర చూసి పిలుస్తాడు. మహేంద్రని చూసి చక్రపాణి ఆశ్చర్యపోతాడు. కాలేజీలో అడిగితే.. మీ కూతురు వసుధార ఎక్కడికో వెళ్ళిందని చెప్పారని చక్రపాణిని మహేంద్ర అడుగగా.. ఓహో వసుధార అబద్ధం చెప్పిందా అని మనసులో అనుకుంటాడు చక్రపాణి. పక్కనే మా ఇల్లు ఉంది రండి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చక్రపాణి అనగా.‌ మహేంద్ర తన కార్ చెడిపోయిందని చెప్తాడు. మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తుంటాడు. నా కొడుకు ఎక్కడ నాకు నిజం చెప్పండని మహేంద్ర అడుగగా.. ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చక్రపాణి అంటాడు.

బొప్పాయి తిన్న స్వప్నపై సీరియస్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -133 లో.. స్వప్న హాల్లో కూర్చొని బొప్పాయి తింటూ ఉంటుంది. అక్కడే అందరు ఉంటారు. స్వప్న బొప్పాయి తినడం అపర్ణ చూసి.. ఏం తింటున్నావని అడుగుతుంది. బొప్పాయి తింటున్న అని స్వప్న అనగానే.. అందరూ షాక్ అవుతారు. కడుపుతో ఉన్న అమ్మాయి ఎవరైనా బొప్పాయి తింటారా? నీకు తెలియపోతే ఎవరినైనా అడగాలి కదా అని అపర్ణ స్వప్నపై కోప్పడుతుంది. వెంటనే డాక్టర్ ని పిలిచి చెకప్ చెయ్యాలని అపర్ణ అంటుంది. డాక్టర్ వస్తే నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం విషయం తెలుస్తుందని స్వప్న టెన్షన్ పడుతుంది. రాజ్ ని డాక్టర్ కి కాల్ చేసి రమ్మని ఇందిరాదేవి అంటుంది.

ముద్దుల్లేకుండా తీస్తారా...ఆర్జీవీ గారు నన్ను వదలటంలేదు!

ఈటీవీలో రీసెంట్ గా "ఆలీతో ఆల్ ఇన్ వన్" అనే గేమ్ షో ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ షో కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక హోస్ట్ ఆలీ చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఇక ఈ వారం ఎపిసోడ్ కి ఆరియానా, మెహబూబ్, అలీ రెజా వచ్చారు. ఇందులో హోస్ట్ ఆలీని బావా, బావా అంటూ రకరకాలుగా టీజ్ చేసింది ఆరియానా. వీళ్ళ ముగ్గురితో రకరకాల గేమ్స్ ఆడించారు ఆలీ. ఫస్ట్ రౌండ్ "నేడే చూడండి" లో మెహబూబ్ వచ్చి గేమ్ ఆడి టవర్ ఫ్యాన్ ని గెలుచుకున్నాడు. ఇక నెక్స్ట్ రౌండ్ "నేనైతే"లో స్క్రీన్ మీద ఇచ్చిన పిక్చర్స్ ని అల్లి ఒక కథ చెప్పాలన్నమాట...ఇందులో ముగ్గురూ రకరకాల కథలు చెప్పారు.

నేను బాగానే ఉన్నాను...ఆ పుకార్లను నమ్మొద్దు

షూటింగ్ టైములో తన  కాలికి గాయం అయ్యిందని దాంతో  హాస్పిటల్ లో చేరినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన ఒక మెసేజ్ ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.  "ప్రియమైన అందరికీ , నేను ఆరోగ్యంగానే ఉన్నాను, షూటింగ్ సమయంలో నేను ప్రమాదానికి గురయ్యానని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను మీరంతా దయచేసి నమ్మొద్దు. నేను బాగున్నానన్న విషయాన్ని  మీ అందరికీ తెలియజేయడానికి ఇది రాస్తున్నాను.  బోనాలు పండుగ నేపథ్యంలో ఒక సాంగ్  షూటింగ్ కోసం వెళ్ళాను..షూటింగ్ లో నాకు ఎలాంటి గాయాలు కాలేదు...ఇక నేను చేసిన డాన్స్ సూపర్ డూపర్ గా ఉండబోతోంది. దాన్ని మీరంతా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు." అని ఆ మెసేజ్ లో చెప్పారు.