English | Telugu

నీ గాలి మాటల్ని ఖాళీగా ఉన్న ప్రదీప్ కి చెప్పు..

డ్రామా జూనియర్స్ సీజన్ 6 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రతీ వారం చిన్నారులు చేస్తున్న స్కిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత పెద్ద డైలాగ్స్ ని ఐనా సరే అవలీలగా చెప్పేసి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేసేస్తున్నారు. ఇక ఆదివారం రాత్రి ప్రసారం కాబోయే ఈ షోకి "బేబీ" మూవీ నుంచి హీరో హీరోయిన్స్ వచ్చారు. వీళ్ళు మంచి ఎనెర్జీతో వచ్చి స్టేజి మీద స్టెప్పులేసి అందరిలోనూ హుషారు పెంచితే చిన్నారి కంటెస్టెంట్స్ ఐన  లోకేష్ , భారతి మాత్రం స్కూల్ యూనిఫామ్ లో వచ్చి "అమ్మాయే సన్నగా" అంటూ పవన్ కళ్యాణ్ సాంగ్ కి దుమ్ము లేపే డాన్స్ వేసి అందరిని ఫిదా చేసేసారు. స్టూడెంట్ లోకేష్, భారతి ఎనెర్జీ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్ లో ఉంటుంది. పనిలో పనిగా హోస్ట్ ప్రదీప్ మీద కూడా పంచెస్ పేల్చేశారు ఇద్దరూ. పవన్ కళ్యాణ్, భూమిక నటించిన ఖుషి మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందులో భూమిక బొడ్డు సీన్ కూడా అంతే హిట్ అయ్యింది. ఆ సీన్ ని ఈ చిన్నారులిద్దరూ రీక్రియేట్ చేసి నవ్వు తెప్పించారు.

నాకు కూడా అప్పట్లో ఒక బేబీ ఉంది

ఆహా వేదిక మీద సర్కార్ సీజన్ 3 ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసింది. దీనికి "బేబీ" మూవీ టీం వచ్చింది. ఇక ఈ స్టేజి మీదకు రాగానే స్టూడెంట్ ఆడియన్స్ ని చూసి చాలా ఖుషీ ఐపోయాడు హోస్ట్ ప్రదీప్. "మిమ్మల్ని చూడగానే నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాను..నా కాలేజీ లైఫ్ కూడా గుర్తొస్తుంది..అని చెప్పాడు..కాలేజీ లైఫ్, ఫ్లాష్ బ్యాక్ అంటే చాలు అప్పట్లో జరిగిన ఎన్నో స్టోరీస్ కూడా గుర్తొస్తాయి కదా..మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అటెండెన్స్, మార్కులు కాకుండా..అప్పటి లవ్ స్టోరీస్, క్రష్ లు గుర్తొస్తూ ఉంటాయి. అందరి లైఫ్ లో ఒక స్టోరీ ఉంటది కదా..మన లైఫ్ లో కూడా ఓ బేబీ ఉంటది కదా..నాకు ఆ రోజుల్లో ఒక బేబీ ఉంది.

మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది...

ఢీ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ ఐపోయింది. రాబోయే వారం నుంచి టీమ్స్ మధ్య పోటీ నువ్వా - నేనా అన్నట్టుగా ఉండబోతోంది అన్న విషయం ఈ ప్రోమో ద్వారా అర్ధమైపోతుంది. ముందుగా కింగ్స్ ఆఫ్ కరీంనగర్ వెర్సెస్ సైరా రాయలసీమ టీమ్స్ మధ్య ముందుగా పోటీ మొదలయ్యింది. తర్వాత బెజవాడ టైగర్స్ వెర్సెస్ ఓరుగల్లు వీరులు టీమ్స్ మధ్య పోటీ కూడా అంతే రసవత్తరంగా సాగింది. ఇక ఈ షోకి బాలయ్య గెటప్ లో వచ్చిన హైపర్ ఆది ఒక అట్రాక్షన్ ఐతే ..యుట్యూబ్ లో  ఫ్రస్ట్రేషన్ వీడియోస్ చేస్తూ మూవీస్ లో నటిస్తూ ఫేమస్ ఐన  సునయన ఈ స్టేజి మీదకు  ఎంట్రీ ఇచ్చి ఆ అట్రాక్షన్ కి కొంచెం కామెడీ ఎమోషన్ టచ్ ఇచ్చి  ఫన్ క్రియేట్ చేసింది.

 కరివేపాకు వెళ్లి పక్కన నుంచో... మీ అమ్మతో తిట్టిస్తావా...

ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం కామెడీ ఏమో కానీ భాస్కర్ వాళ్ళ అమ్మ మాత్రం ఇమ్మానుయేల్ ని పట్టుకుని అందరి ముందు దుమ్ము దులిపేసింది. పటాస్ ప్రవీణ్ టీమ్ లో సత్తిపండు తన భార్యతో వచ్చి స్కిట్ చేసాడు. అది చూసిన రష్మీ వెంటనే మాట్లాడుతూ ఒక  సీనియర్ కపుల్ మన మధ్య ఉన్నారు అని భాస్కర్ వాళ్ళ అమ్మని నాన్నని చూపించింది. మీ పెళ్ళై ఎన్నేళ్లయింది అని అడిగేసరికి 1976 లో అయ్యింది అని చెప్పారు వాళ్ళు . "మీ ఇంట్లో వంటలో ఉప్పు తక్కువైతే ఎం చేస్తారు" అని అడిగేసరికి "ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకుంటాం" అని చెప్పారు భాస్కర్ వాళ్ళ నాన్న. "ఎప్పుడైనా నాన్నని కొట్టావా" అని భాస్కర్ వాళ్ళ అమ్మని ఇమ్మానుయేల్ ని అడిగాడు " నేను ఎప్పుడూ కొట్టలేదు. రెండు రోజులు మాట్లాడను కానీ...కొట్టడం ఉండదు...మా ఆయన అంటే చాలా ఇష్టం. నేనన్నా కూడా ఆయనకు అంతే ఇష్టం..మా ఆయనకు 18 ఏళ్ళు నాకు 13  ఏళ్ళు..అప్పుడు పెళ్లి చేశారు..అప్పుడు అన్ని రకాల ఆటలు ఆడేదాన్ని.

కృష్ణని ప్రేమిస్తున్నాని మురారి చెప్పడంతో ఎమోషనల్ అయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -197 లో.. కృష్ణని స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు తీసి కాపాడతాడు. కృష్ణని  మురారి ఎత్తుకొని వెళ్తుంటే.. సడన్ గా ముకుంద ఎదురుపడుతుంది. నువ్వు ఏంటి ఇక్కడ అని మురారి షాక్ అవుతాడు. రాను అనుకున్నావా? రాలేనని అనుకున్నావా  అని ముకుంద అంటుంది. ఎందుకు వచ్చావ్ అని మురారి అడుగుతాడు. "నువ్వు ఎక్కడ ఉంటే.. నేను అక్కడే" అని ముకుంద అంటుంది. సరే నీతో మాట్లాడాలి మళ్ళీ కలుస్తా అని మురారి వెళ్ళిపోతాడు. నీతో కూడా తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయని ముకుంద అంటుంది.