English | Telugu
రాకేష్ మాష్టర్ పేరిట ప్రతీ ఏడాది జాతీయ పురస్కారం
Updated : Jun 29, 2023
దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాష్టర్ పేరుతో జాతీయ పురస్కారాన్ని అందించబోతున్నారు ఆయన శిష్యులు సత్య మాష్టర్ , శేఖర్ మాష్టర్. హైదరాబాద్‌లో జరిగిన రాకేష్ మాష్టర్ సంతాప సభలో ఈ విషయాన్ని చెప్పారు. తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్.. ఈ విషయాన్ని ప్రకటించారు. ‘రాకేష్ మాష్టర్ ఫోటోకు పూలదండలు వేసి వెళ్లిపోవడం కాదు..ఆయన ఎల్లకాలం అందరికీ గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం. మాష్టర్ పేరు మీద ఒక నేషనల్ అవార్డుdని స్టార్ట్ చేద్దాం అని నేను సత్య మాష్టర్‌కు చెప్పాను. సత్య మాష్టర్ ఆధ్వర్యంలో శేఖర్ మాష్టర్ సహకారంతో వైవీఎస్ చౌదరి ప్రోద్భలంతో ఈ వేదిక ద్వారా ఆ మహానుభావుడి పేరు మీద ఈ నేషనల్ అవార్డుని ప్రతి ఏటా అందజేస్తాం" అని ప్రకటించారు.
రాకేష్ మాష్టర్ అసలు పేరు ఎస్.రామారావు. 1968 లో తిరుపతిలో పుట్టారాయణ. హైదరాబాద్‌లో ముక్కురాజు మాష్టర్ దగ్గర కొంతకాలం అసిస్టెంట్ గా వర్క్ చేసాక "ఆట డ్యాన్స్ షో"లో డ్యాన్స్ మాష్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శేఖర్ మాష్టర్, జానీ మాష్టర్ లాంటి వారికి శిక్షణ ఇచ్చారు రాకేష్ మాష్టర్. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన మూవీస్ లోని సాంగ్స్ ని కొరియోగ్రాఫ్ చేశారు రాకేష్ మాష్టర్. జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ లో కూడా కనిపించి నవ్వులు పూయించారు. 2020 లో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాష్టర్‌కు డాక్టరేట్ కూడా అందించారు.