English | Telugu
గదిలోపల ముకుంద ఉందేమోనని టెన్షన్ పడుతున్న మురారి!
Updated : Jun 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -195 లో.. ముకుంద పంపిన ఫొటోస్ చూస్తుంటాడు. మురారి ఈ ఫొటోస్ కచ్చితంగా ముకుందనే పంపి ఉంటుందని అనుకుంటాడు. అంతలోనే కృష్ణ వస్తుంది. కృష్ణ రావడం చూసిన మురారి ఫొటోస్ వెనక్కి దాచేస్తాడు.. ఏంటి వెనకాల దాచేస్తున్నవని కృష్ణ అడుగగా.. ఏం లేదని మురారి కవర్ చేస్తాడు.
మరొక వైపు కృష్ణ గురించి మురారి డైరీలో రాసిందంతా ముకుంద చదువుతూ ఆవేశపడుతుంది. నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించి మోసం చేశావ్? కృష్ణ నచ్చిందా? నాకేం తక్కువ.. నిన్నే ప్రేమించాను కదా అని ముకుంద ఎమోషనల్ అవుతూ.. తనలో తానే అనుకుంటుంది. కృష్ణ అటుపక్కగా వెళ్తుంటుంది. అలా వెళ్తుండగా ముకుంద ఉన్న గది బయట చెప్పులు ఉండడంతో ఎవరైనా ఉన్నారా అంటూ డోర్ కొడుతుంది. లోపలే ఉన్న ముకుంద.. నేను ఇక్కడే ఉన్నట్లు ఏమైనా తెలిసిందా? ఏంటని టెన్షన్ పడుతుంది.
ముకుంద వెళ్లి డోర్ తీసి మురారిని ప్రేమించింది తనే అని ఇన్ని రోజులుగా మురారితో ప్రవర్తించిన తీరు అంత కృష్ణకి చెప్పినట్టు ముకుంద కల కంటుంది. ఒక్కసారిగా కృష్ణకి నిజం చెప్పినట్టు, ముకుందకి ఎదురు తిరిగి మురారిని వదిలి ఎక్కడికి వెళ్ళనని కృష్ణ అన్నట్లు ఉహించుకుంటుంది ముకుంద. కాసేపటికి ఊహలోంచి బయటకు వచ్చి.. నో అలా జరగకూడదని ముకుంద టెన్షన్ పడుతుంది. కృష్ణ డోర్ కొట్టి ఎవరు డోర్ తియ్యకపోవడంతో లోపల ఎవరు లేరేమో అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది కృష్ణ.
ఆ తర్వాత కృష్ణ, మురారి భోజనం చెయ్యడానికి రెడి అవుతారు. ఒక్క నిమిషం ఏసీపీ సర్ దేవుడికి మొక్కి తిందామని కృష్ణ అంటుంది. "నాకు చిన్న పిల్లాడి మనస్తత్వంగా ఏసీపీ సర్ ని ఇచ్చావ్.. మేం ఎప్పుడు ఇలాగే ఉండేలా చూడు దేవుడా" అంటూ కృష్ణ అంటుంది. మురారి నవ్వుకుంటాడు. కాసేపటికి ఇక్కడ ఇంక ఎవరో ఉన్నారేమోనని అనిపిస్తుంది ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది. ఎందుకు అలా అనిపించిందని మురారి అడుగుతాడు.
ఇందాక అటు వైపు వెళ్తుంటే ఒక గది ముందు ఎవరివో చెప్పులు బయట ఉన్నవని కృష్ణ చెప్పగానే.. ముకుంద గాని వచ్చిందా అని మురారి కంగారుపడుతుంటాడు. ఇక్కడ పని వాళ్ళవి అయి ఉంటాయి కృష్ణ అని మురారి అంటాడు. అవి పని వాళ్ళ చెప్పులలాగా లెవ్వు.. యూత్ వాళ్ళు వేసుకునే చెప్పులలాగా ఉన్నాయని కృష్ణ అంటుంది. అలా కృష్ణ అనగానే ముకుంద వచ్చిందేమో అని మురారి టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.