English | Telugu

దీపను చాలా మిస్ అవుతూ ఉంటా..మోనిత అప్ డేట్స్ పెడుతూనే ఉంటుంది


తెలంగాణలో బోనాలు మొదలైన సందర్భంగా స్టార్ మావాళ్ళు "మా బోనాల జాతర" పేరుతో ఒక షో ప్లాన్ చేసింది..జులై 2 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కాబోతోంది. ఇందులో చాలామంది సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్ బాబు, దీప, మోనిత మాత్రం ఫామిలీ ప్యాకేజీలా వచ్చారు. హోస్ట్స్ గా వర్షిణి, రవి ఉన్నారు. "డాక్టర్ బాబు కార్తీక దీపం సీరియల్ ఐపోయాక మీరు ఎవరిని బాగా మిస్ అవుతున్నారు" అని వర్షిణి అడిగేసరికి "మోనిత సోషల్ మీడియాలో అప్ డేట్స్ అవీ పెడుతూనే ఉంటుంది ..కానీ దీప మాత్రం అప్ డేట్స్ ఏవీ సోషల్ మీడియాలో పెట్టదు..అందుకే నేను ఎక్కువగా దీపను మిస్ అవుతాను" అని డాక్టర్ బాబు చెప్పేసరికి దీప చాలా ఖుషీ ఐపోయింది.

"మీరు ఇలా అమ్మవారి గెటప్ లో దర్శనమివ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎప్పటినుంచి మిమ్మల్ని చూడబోతున్నాం" అని హోస్ట్ రవి అడిగేసరికి "త్వరలో మీ ముందుకు రాబోతున్నా" అని చెప్పింది దీప అలియాస్ ప్రేమి విశ్వనాధ్. ఆమె మాటలకు అవినాష్ మాములుగా డాన్స్ చేయలేదు " మా స్టార్ మాలో వంటలక్క, డాక్టర్ బాబు మళ్ళీ కనబడతారు" అంటూ ఫుల్ జోష్ తో చెప్పాడు.. ఇక వీళ్ళతో ఎన్నో గేమ్స్ ఆడించారు రవి, వర్షిణి. లోకల్ స్టార్స్ వర్సెస్ పాన్ ఇండియా స్టార్స్ అంటూ వీళ్లందరినీ డివైడ్ చేసేసి వాళ్ళ మధ్య రకరకాల పోటీలు పెట్టారు. అలాగే ఈ షోకి బలగం మూవీ టీం నుంచి డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య వచ్చారు...ఇక అవినాష్ మాత్రం వైట్ అండ్ వైట్ డ్రెస్ లో సింగం మూవీలో సూర్య గెటప్ లో వచ్చాడు. ఆయన అలా నడుస్తూ వచ్చి మీసం మెలేసేసరికి "పులి అన్నారు కదా మరి పులిహోర వచ్చాడేమిటి" అనే కౌంటర్ పేలేసరికి షాకయ్యాడు. ఇలా ఈ ఆదివారం ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వడానికి ఈ షో రాబోతోంది.