English | Telugu
చపాతీ విత్ ఐస్ క్యూబ్స్..గులాబ్ జామున్ విత్ పప్పు..కిచెన్ థీమ్ లో సూపర్ క్వీన్స్
Updated : Jun 29, 2023
సూపర్ క్వీన్ షో ప్రతీ వారం వెరైటీ కాన్సెప్ట్స్ చేస్తూ ఆడియన్స్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది . లాస్ట్ వీక్ సూపర్ క్వీన్స్ కాస్తా సూపర్ కింగ్స్ లా వచ్చారు. ఇక నెక్స్ట్ వీక్ ఈ సూపర్ క్వీన్స్ అంతా "కిచెన్ థీమ్" రౌండ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో వంటలు చూస్తే వాటిని అస్సలు తినబుద్దే కాదు..అలాంటి వెరైటీస్ చేసేసరికి హోస్ట్ ప్రదీప్ కూడా షాకయ్యాడు. "అయ్యయ్యో ..నేను ఏం చూడకూడదు అనుకున్నానో మీరు అవే మీ చేతుల్లో తీసుకొచ్చారు" అని తెగ ఫీలైపోయాడు ప్రదీప్.
"చపాతీ విత్ ఐస్ క్యూబ్స్"పేరుతో ఓక్ వెరైటీ వంటకాన్ని ప్రిపేర్ చేసింది విద్యుల్లేఖ..."చూడడానికే ఇలా ఉందంటే తింటే ఇంకేమవుతుందో" అన్నాడు "గులాబ్ జామున్ విత్ పప్పు" అంటూ మరో సూపర్ క్వీన్ తీసుకొచ్చి ప్రదీప్ కళ్ళ ముందు పెట్టేసరికి చెవిలో వేలు పెట్టుకుని పక్కకు తప్పుకున్నాడు. ఇక కండక్టర్ ఝాన్సీ తాను చేసిన వంటకం చూపించి "మీ జన్మ ధన్యమైపోయే వంటకం" అంది. దానికి ప్రదీప్ " తినాలనికూడా అనిపించట్లేదు..నా జన్మ ధన్యమైపోయింది" అన్నాడు.. ఇలా ఈ ఆదివారం షోలో సూపర్ క్వీన్స్ అంతా కూడా రకరకాల వెరైటీ వంటకాలతో హోస్ట్, ఆడియన్స్ నోరు ఊరించడానికి రాబోతున్నారు. మరి ఆ వంటకాలు ఏమిటి ఎలా ప్రిపేర్ చేశారో తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే. సూపర్ క్వీన్స్ సీజన్ మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తోంది. రేటింగ్ కూడా పర్వాలేదనిపించేలా వస్తోంది.