English | Telugu
వాళ్ళ కుట్ర గురించి మహేంద్రకి నిజం చెప్పేసిన జగతి!
Updated : Jun 30, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'..ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -802 లో....ఏంజిల్ వసుధారని తన ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడే హాల్లో ఉన్న రిషి ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. ఏంజిల్, వసుధర లోపలికి వచ్చి విశ్వనాథ్ కి జరిగిందంతా చెప్తారు. కాసేపటికి వసుధార, ఏంజెల్ లోపలికి వెళ్తారు. వసుధార వచ్చింది రిషి చూడడు. వసుధార గదిలోకి వెళ్లిపోయాక రిషి వచ్చి విశ్వనాథ్ తో కాలేజీ గురించి మాట్లాడతాడు.
మరొక వైపు వసుధారకి రిషి హెల్ఫ్ చేసాడని ఏంజిల్ కి తెలుస్తుంది. రిషి చాలా మంచివాడని ఏంజిల్ చెప్తుంది. నీ ఫ్రెండ్ అంటే నీకు ఇష్టమా అని ఏంజిల్ ని వసుధార అడుగుతుంది. అవును నాకు రిషి అంటే ఇష్టం అయిన రిషిని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు. నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉంటున్నావ్ కదా.. రిషి గురించి నీకే తెలుస్తుందని వసుధారతో ఏంజిల్ అంటుంది. మరొకవైపు రిషితో మహేంద్ర మాట్లాడాలనుకుంటాడు. తన ఫోన్ నుంచి చేస్తే గుర్తుపడతాడని.. వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని రిషి కి కాల్ చేస్తాడు మహేంద్ర. రిషి హలో అనగానే మహేంద్ర రిషి మాట విని ఎమోషనల్ అవుతాడు. మరొక వైపు చక్రపాణికి ఏంజిల్ ఫోన్ చేస్తుంది. వసుధార గురించి చెప్పి, తను నా దగ్గరే ఉంది. మీరేం టెన్షన్ పడకండని చక్రపాణితో ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత వసుధార చక్రపాణితో మాట్లాడుతూ.. నాకేం కాలేదు. మీరేం టెన్షన్ పడకండని వసుధార చెప్తుంది. మరొక వైపు మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఫణింద్రతో శైలేంద్ర మాట్లాడతాడు. మిషన్ ఎడ్యుకేషన్ లో జగతి సరిగ్గా ఆసక్తి చూపించట్లేదు. జగతిని మిషన్ ఎడ్యుకేషన్ నుండి తప్పించండని శైలేంద్ర అనగానే.. జగతి కెపాసిటీ గురించి నీకు తెలియదని శైలేంద్రని కోప్పడతాడు ఫణీంద్ర.
శైలేంద్ర, దేవయాని చేసే కుట్ర గురించి జగతికి చెప్పాలని ధరణి తనని తీసుకొని వెళ్తుంటే.. అప్పుడే వస్తున్న మహేంద్ర చూసి వాళ్ళ వెనకాల వెళ్తాడు. ధరణి, జగతి మాట్లాడుకుంటుంటే మధ్యలో మహేంద్ర.. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పండని మహేంద్ర నిలదీస్తాడు. ధరణిని జగతి పక్కకి పంపిస్తుంది. ఇక రిషిపై నింద వెయ్యడానికి కారణం గురించి జగతి చెప్తుంది. ఇన్ని రోజులు దేవయాని, శైలేంద్ర చేసిన కుట్రల గురించి జగతి చెప్తుంది. మహేంద్ర షాక్ అవతాడు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి చెప్తా అని మహేంద్ర వెళ్తుంటే.. జగతి ఆపి టైం వచ్చినప్పుడు ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.