తరుణ్ మాష్టర్ కు ముద్దు పెట్టిన రాధ
'నీతోనే డ్యాన్స్' ఈ వారం ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ప్రోగ్రాంలో డ్యాన్స్‌ల కంటే మాస్ మసాలా ముద్దులు, హగ్గులు, మధ్యమధ్యలో గొడవలు అబ్బో ఒకటేమిటి ఫుల్ మీల్ షో ఇది. ఇక లేటెస్ట్ ప్రోమోలో అయితే తరుణ్ మాష్టర్ పండగ చేసుకున్నారు. ప్రోమో స్టార్టింగ్‌లోనే నటరాజ్ మాష్టర్ బాలయ్య బాబు గెటప్‌లో నీతూతో కలిసి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. బాలయ్య స్టెప్స్ ని అచ్చు గుద్దినట్టు అలానే దింపేశారు నటరాజ్ మాష్టర్. 'సూపర్ స్టార్' థీమ్ తో రాబోయే వారం ఎపిసోడ్ అదరగొట్టబోతోంది. ఈ పెర్ఫామెన్స్‌కు సదా, రాధ కాంప్లిమెంట్లు ఇచ్చేశారు.