ఎపిసోడ్ ఐపోయాక ఛమ్మూని మీ దగ్గరకే పంపిస్తా
నీతోనే డాన్స్ షోలో ఫస్ట్ వీక్ నటరాజ్ మాష్టర్ - నీతూ డాన్స్ ఎవరికీ నచ్చలేదు..అలాగే నటరాజ్ మాష్టర్ జోడికి చాలా తక్కువ మార్క్స్ కూడా వచ్చాయి. కానీ ఆ నెక్స్ట్ వీక్ నుంచి ఈ జోడి ఇరగదీసే డాన్సస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్ళ డాన్స్ ని చూసేకొద్దీ చూడబుద్దేసేలా చేస్తున్నారు. ఈ వారం "నీతోనే డాన్స్" లో మహారాష్ట్రకు చెందిన "లావని" డాన్స్ స్టైల్ లో వేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక షో స్టార్టింగ్ లో నటరాజ్ మాష్టర్ గెటప్ చూసి మనసు పారేసుకున్నారు తరుణ్ మాష్టర్..ఆయనతో కలిసి చేసిన గరం మసాలా డాన్స్ పెర్ఫార్మెన్స్ కి రాధా, సదా ఫిదా ఇపోయారు. నటరాజ్ " నేను మాధురి దీక్షిత్, సిల్క్ స్మిత, రాధ , సదా నా ఫాంటసీగా ఉండేవారు...దాన్ని మొత్తం నువ్వే భంగం చేసేసావ్. నేను యోగిలా ఉండేవాడిని, భోగిని చేసేసావ్" అని అన్నారు తరుణ్ మాష్టర్.