English | Telugu
ఆదికి పరువు లేదన్న సిరి...సోదాపి వెళ్ళమన్న ఆది
Updated : Jun 29, 2023
ఈ వారం ఢీ ప్రీమియర్ లీగ్ లో టీమ్స్ ని రిప్రెజంట్ చేయడానికి వచ్చిన సిరి హన్మంత్, మధు ప్రియా, హరితేజ మీద కౌంటర్ లు పేల్చాడు ఆది. "ఏమిటి మనది వైజాగా" అని శేఖర్ మాష్టర్ సిరిని అడిగేసరికి "ఏమనుకున్నారు మాష్టర్ మరి ..మా దగ్గర ఒడియమ్మ అనేది ఊత పదం" అని సిరి చెప్పేసరికి ఆది తన ఫోన్ లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ "సిరి సోదాపి పాయింట్ కి రా" అని కౌంటర్ వేసాడు. దానికి ప్రదీప్, దీపికా ఇద్దరూ కలిసి "నీ దగ్గర ఉన్నది ఆండ్రాయిడ్..అందులో సిరి ఉండదు...ఐ ఫోన్ లో ఉంటుంది" అని అన్నారు.."ఇది ఐఫోన్ రా " అని ఆది క్లారిటీ ఇచ్చేసరికి "ఆది అది ఐఫోన్ కాదు నీ ఫోన్" అంది రివర్స్ కౌంటర్ వేసింది సిరి.
దానికి శేఖర్ మాష్టర్ స్పందించి "ఆదికే పంచా" అనేసరికి మళ్ళీ ఆది ఫోన్ తీసి మాట్లాడుతూ "హా సిరి ఇంకెళ్లొచ్చు..చాలు టైం ఐపోయింది" అన్నాడు. తర్వాత ఆది గురించి ఒక కవిత కూడా చెప్పింది సిరి. "మా పొలంలో ఎరువు లేదు..ఆదికి పరువు లేదు..మా ఇంట్లో పెరుగు లేదు..వైజాగ్ కి తిరుగు లేదు" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. "సైరా రాయలసీమ" టీమ్ ని రిప్రెజంట్ చేయడానికి వచ్చిన హరితేజ మీద కౌంటర్ వేసాడు "ఏమిటా స్టోన్" అంటూ హరి తేజ వాయిస్ మీద ప్రదీప్ కామెంట్ చేససరికి ఆది మధ్యలో వచ్చి " ఆల్రెడీ సిరి, మళ్ళీ హరి...సెట్ అంతా వర్రీ" అన్నాడు.."కాదండి అసలు ఆది గారి గెటప్ చూసారా" అని ప్రదీప్ అనడంతో "ఆ మొహానికి ఆ తిలకం ఏమిటో" అని సెటైర్ వేసింది హరితేజ. "ఇది తిలకం..ఇది పెట్టుకున్నాక ఎవరినీ కెలకం" అన్నాడు ఆది. "కెలకం కెలకం అంటూ అందరినీ కెలుకుతున్నారుగా" అంది సిరి. కింగ్స్ ఆఫ్ కరీంనగర్ టీమ్ ని రిప్రెజంట్ చేయడానికి మధుప్రియ వచ్చింది. "వచ్చిండే మెల్లగా మెల్లగా" అనే సాంగ్ పాడేసరికి "కానీ మధుప్రియ చాలా బాగా పాడావ్..ఇది ఒరిజినల్ ఎవర్రా పాడింది" అని ఆది కౌంటర్ వేసేసరికి షాకయ్యింది మధుప్రియ. ఈ వారం ఢీ షోలో ఇలా ఆది లేడీస్ మీద పంచెస్ వేసి ఎంటర్టైన్ చేసాడు.