English | Telugu

వెళ్లి ఆస్కార్ తెచ్చుకుంటా...యమదొంగ మూవీలో నటించింది రాఘవేంద్రరావు గారు


"ఆలీతో ఆల్ ఇన్ వన్ " ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి రోల్ రైడా, ఫైమా, యాదమ్మ రాజు వచ్చారు.."నీ ఒరిజినల్ పేరేమిటి" అని రోల్ రైడాని అడిగారు ఆలీ. "ఎప్పుడూ చెప్పలేదు" అన్నాడు రోల్ రైడా..ఆల్రెడీ "రోల్ ఆర్..రైడా ఆర్" అని ఆలీ అనేసరికి "ఇంకొక ఆర్ వేస్తే ట్రిపుల్ ఆర్ ఐపోతుంది ఆస్కార్ కూడా తెచ్చేసుకుంటా" అని రైడా అనేసరికి "ఆస్కార్ ఇవ్వరు కానీ భాస్కర్ ఐతే ఇస్తారు" అన్నారు ఆలీ. తర్వాత సెట్ లోకి ఫైమా వచ్చింది. "లేటెస్ట్ నేమ్ ఫైమా అని ఎవరిని ఉద్దేశించి పెట్టారు మీ నాన్నగారు" అని ఆలీ అడిగారు. "ఊరికే ఫైవ్ రూపీస్ ఇయ్యమ్మ ఇయ్యమా అంటే ఫైమా అని పెట్టేసారు" అని ఫన్నీగా చెప్పింది ఫైమా. తర్వాత సెట్ లోకి యాదమ్మ రాజు వచ్చాడు. "ఎంతమంది మొత్తం మీ ఫామిలీ" అని అడిగేసరికి "నలుగురం సర్ ..నేనే పెద్దా" అన్నారు రాజు. "కానీ పొట్టిరాయుడివి" అని కామెంట్ చేశారు ఆలీ.

ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చే ఒక సెగ్మెంట్ కోసం ఆలీ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి రెడ్ షర్ట్ వేసుకుని డాన్స్ చేశారు. తర్వాత ఒక ప్రశ్న అడిగారు ఆలీ "యమదొంగ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్ పేరేమిటి" అనేసరికి "రాఘవేంద్ర రావు గారు" అని చెప్పింది ఫైమా. దాంతో అందరూ నవ్వేశారు. యాదమ్మ రాజు హింట్ ఇచ్చేసరికి "బాబూమోహన్ గారు" అని చెప్పింది ఫైమా..ఇలా నెక్స్ట్ వీక్ షో మంచి ఫన్నీగా ఉండబోతోంది. ఇకపోతే ఈ మధ్య షోస్ అన్నిటిలో కూడా చిన్న చిన్న సెలబ్రిటీస్ బాగా హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. అన్ని షోస్ లో కూడా వాళ్ళే కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.