English | Telugu
తొక్కలో పిల్లి అన్న ఆది..నాలాంటి అమ్మాయి దక్కాలంటే యుద్దాలు చేయాలన్న దీపికా
Updated : Jun 28, 2023
ఢీ ప్రీమియర్ లీగ్ ఈ వారం స్టైలిష్ కొరియోగ్రాఫర్స్ వచ్చి అద్దిరిపోయే పెర్ఫార్మెన్సెస్ చేసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ వీక్ నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు టీమ్ లు వచ్చి తమ సత్తా చూపించాయి. ఈ వారం మరో నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు టీమ్ లు వచ్చాయి. అందులోంచి సాయి మాస్టర్ టీం "కోనసీమ పందెం కోళ్లు" పేరుతో వచ్చారు. వీళ్ళ టీంని రిప్రెజంట్ చేయడానికి గెటప్ శీను వచ్చాడు. తర్వాత సందీప్ మాస్టర్ టీం "వాల్తేర్ వారియర్స్" పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళను రిప్రెజంట్ చేయడానికి సిరి హన్మంత్ వచ్చింది.
థర్డ్ టీమ్ గా ప్రభు "సైరా రాయలసీమ" పేరుతో వచ్చి దుమ్ము దిలిపారు..వీళ్ళను రిప్రెజంట్ చేయడానికి హరితేజ రాగా ఫైనల్ గా కృష్ణ మాస్టర్ అండ్ టీం "కింగ్స్ ఆఫ్ కరీంనగర్" పేరుతో వచ్చారు. ఈ టీమ్ ని రిప్రెజంట్ చేయడానికి సింగర్ మధుప్రియ వచ్చింది. ఒక్కొక్కళ్ళ ఎంట్రీ అదిరిపోయింది. ఇలా ఇప్పటికి 8 టీములు ఎనిమిది ప్రాంతాల నుంచి వచ్చాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఈ టీమ్ పెర్ఫార్మెన్సెస్ అనేవి స్టార్ట్ కాబోతోన్నాయి.
ఐతే పూర్తిగా డాన్స్ షో మాత్రమే ఉంటే చూసే ఆడియన్స్ లో మొనాటనీ వస్తుందని భావించిన మేకర్స్ హైపర్ ఆదిని, దీపికా పిల్లిని తీసుకొచ్చారు. వీళ్ళు మధ్య మధ్యలో కామెడీ కంటెంట్ ఇస్తూ ఆడియన్స్ ని నవ్వించబోతున్నారు. లాస్ట్ వీక్ ఆది తన మ్యారేజ్ కోసం ఈ షోకి వచ్చే టీమ్స్ నుంచే మంచి అమ్మాయిని సెలెక్ట్ చూసుకుంటాను అన్నాడు. కానీ ఈ వారం మాట మార్చి "సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరగడం ఎందుకు..పక్కనే దీపికా పిల్లి ఉండగా" అని ప్రదీప్ తో చెప్పాడు. అప్పుడు ప్రదీప్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. కంగారు పడకు ఈ వారం మరో నాలుగు టీమ్స్ రాబోతున్నాయి అనేసరికి "తొక్కలో పిల్లితో మనకు పనిలేదు కానీ వాళ్ళను ప్రవేశ పెట్టు" అన్నాడు కామెడీగా. తర్వాత వచ్చిన టీమ్స్ అన్నిటినీ చూసాక ఫైనల్ లో మళ్ళీ మాట మార్చాడు ఆది..కొత్తవాళ్లను పరిచయం చేసుకుని ఇంప్రెస్ చేయడం కష్టం పాత పరిచయమే బెస్ట్ అనుకుంటున్నా అన్నాడు
దానికి దీపికా పిల్లి స్పందించి "నా లాంటి అమ్మాయి దక్కాలంటే యుద్దాలు చేయాలి..అసలు నా కోసం ఎంత మంది క్యూ కట్టారో తెలుసా" అంది దీపికా.."సరే నేను నీకు నచ్చేలా చేసుకుంటా ఓకే నా" అన్నాడు ఆది. "నువ్వు నాకు నచ్చడమే కాదు ప్రతీ వారం వచ్చే నా ఫామిలీ మెంబర్స్ కి కూడా నచ్చాలి..అప్పుడు మన పెళ్లి విషయం ఆలోచిస్తాను" అంది. "నువ్వు ఒక్కో ఫామిలీ మెంబర్ ని పిలువు ..నేను ఒక్కో గెటప్ లో వచ్చి మీ ఫామిలీ మెంబర్స్ ని ఇంప్రెస్ చేయకపోతే అడుగు" అని సవాల్ విసిరాడు ఆది. ఇలా వీళ్ళ కామెడీ ప్లస్ డాన్స్ కలిపి నెక్స్ట్ వీక్ నుంచి సందడి చేయబోతోంది ఢీ ప్రీమియర్ లీగ్.