English | Telugu
రాబోయే భార్య కోసం కళ్యాణ్ పడుతున్న కష్టాలు!
Updated : Jun 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -134 లో.. స్వప్న బొప్పాయి తినడం వల్ల కడుపులో బిడ్డకు ఏమైనా అయిందేమోనని అందరూ కంగారు పడి డాక్టర్ ని పిలిచి స్వప్నకి చెకప్ చేపిస్తారు. స్వప్నని తీసుకొని డాక్టర్ గదిలోకి తీసుకెళ్ళి చెక్ చేస్తుంది. స్వప్న ప్రెగ్నెంట్ కాదన్న విషయం డాక్టర్ కి తెలిసిపోతుంది. నువ్వు ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఇంట్లో అబద్ధం ఎందుకు చెప్పావ్. ఇంట్లో వాళ్లకి ఇప్పుడే నిజం చెప్తానని డాక్టర్ అంటుంది.
స్వప్న ఏ పరిస్థితులలో ఈ ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పిందో చెప్తుంది. ఎవరికి చెప్పొద్దని స్వప్న రిక్వెస్ట్ చేస్తుంది. అయిన నీలాగా నీ ఫ్యామిలీని నేను మోసం చెయ్యలేనని డాక్టర్ వెళ్తుండగా.. స్వప్న కత్తితో పొడుచుకొని చనిపోతా అంటూ బెదిరిస్తుంది. దాంతో డాక్టర్ బయటకు వెళ్లి స్వప్నకి అనుగుణంగా కడుపులో బిడ్డ కి ఏం కాలేదని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ చెప్పి అందరిని మోసం చేసావని స్వప్నని తిడుతుంది కావ్య. నీది నువ్వు చూసుకో నా విషయంలో జోక్యం చేసుకోకని కావ్యతో స్వప్న అంటుంది.
ఇంట్లో సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకు. నేను ఆడిన అబద్ధం నిజం చేస్తానని చెప్పి స్వప్న వెళ్ళిపోతుంది. మరొక వైపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన కళ్యాణ్ నడవలేని స్థితిలో ఇంటికి వస్తాడు. కళ్యాణ్ ని చూసిన ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు.. ఏమైంది ఎందుకు ఇలా నడుస్తున్నావని అడుగుతారు. ఫిట్నెస్ కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేశానని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు ఫిట్ నెస్ దేనికో అని ప్రకాష్ అడుగుతాడు. నాకు కాబోయే భార్యని ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా అని కళ్యాణ్ అంటాడు. ఎప్పుడో పెళ్లి చేసుకొనే దానికి ఇప్పటినుండి ప్రాక్టీస్ అవసరమా అని ప్రకాష్ అంటాడు. అప్పుడే అప్పు ఫోన్ చేసి డైట్ గురించి చెప్తుంది. మా కోచ్ డైట్ గురించి చెప్పిందని కళ్యాణ్ అంటాడు. చెప్పిందని అంటున్నావ్? అమ్మాయా? నీ కోచ్ అని ప్రకాష్ అడుగుతాడు. అవునని కళ్యాణ్ అనగానే.. నీ కోచ్ ని ఇంప్రెస్ చెయ్యడానికా ఇదంతా అని ప్రకాష్ అనగానే.. అదేం లేదు నా కోచ్ ఒక మగరాయుడు అని కళ్యాణ్ అంటాడు. అంటే కావ్య చెల్లె అప్పులాగా అని ప్రకాష్ అనగానే.. అలాగే అనుకో అని కళ్యాణ్ అంటాడు.
మరొక వైపు సేట్ ని కిడ్నాప్ చేసి నన్ను ఇరికించిందని కనకంని మీనాక్షీ తిట్టుకుంటుంది. మీనాక్షి వెళ్లి సేట్ కట్లు విప్పుతుంది. అప్పుడే కృష్ణమూర్తి వస్తాడు. సేట్ జరిగిందంతా కృష్ణమూర్తితో చెప్పడంతో.. కనకాన్ని తిడతాడు కృష్ణమూర్తి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.