English | Telugu

శ్రీసత్య పుట్టినరోజున వాళ్ళు రాకపోవడానికి కారణం అదేనా!

శ్రీసత్య బిగ్ బాస్ ప్రియులకు సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్-6 లో 'బ్యూటీ క్వీన్' అని శ్రీసత్యని చెప్తారు. తాజాగా శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ ఫెండ్స్ అందరూ కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు‌. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు.

బిబి జోడీ డాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ఈ సెలబ్రేషన్స్ లో రాజ్, గీతూ రాయల్, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్, ఫైమా, రేవంత్, యాంకర్ శివ ఇలా చాలా మంది హాజరయ్యారు. అందరూ సరదాగా గడుపుతూ శ్రీసత్యతో సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో అందరి దృష్డి అర్జున్ కళ్యాణ్ మీదే ఉంది. అతనితో శ్రీసత్య ఎలా ఉంటుందా అని ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే శ్రీసత్య మాత్రం అందరితో ఉన్నట్టే మాములుగా ఉంది. అయితే గీతు రాయల్.. ఈ సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా ఉండి అందరిలో మంచి జోష్ ని నింపింది.

శ్రీసత్య పుట్టిన రోజు వేడుకలకి ఇనయా రాకపోవడంతో వాళ్ళిదరి మధ్య ఇంకా గొడవలు అలాగే ఉన్నాయనే తెలుస్తుంది. ఈ సెలబ్రేషన్స్ లో ఇనయాతో పాటుగా సుదీప, అభినయశ్రీ కుడా రాలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మంచి స్నేహితుడిగా ఉన్న శ్రీహాన్ కూడా ఈ సెలబ్రేషన్స్ కి రాకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా అని అందరు అనుకుంటున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత శ్రీసత్య పుట్టినరోజున మరొక్కసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేశారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.