English | Telugu

కావ్య, రాజ్ ల రొమాంటిక్ సీన్.. ఆఫీస్ లో రాహుల్ కి అవమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -135 లో.. సేట్ ని చూసిన కృష్ణమూర్తి కనకంని తిడతాడు. ఇక కనకం ఇంటిని సేట్ దగ్గర తాకట్టు పెట్టిన విషయం, తనని కిడ్నాప్ చేసిన విషయం గురించి కృష్ణమూర్తి తెలుసుకుంటాడు. నన్ను కిడ్నాప్ చేసినందుకు మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తానని సేట్ బెదిరిస్తాడు. "మమల్ని క్షమించండి.. వాళ్ళు చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షేమించమని అడుగుతున్నానను" అని కృష్ణమూర్తి రిక్వెస్ట్ చేస్తాడు. అయిన వీళ్ళను వదిలిపెట్టనని సేట్ అంటాడు.

ఆ తర్వాత అక్కడే ఉన్న అప్పు మధ్యలో కలుగజేసుకొని.. మా ఇంటి పత్రాలు మీరు బలవంతంగా తీసుకున్నారని నేను కంప్లైంట్ చేస్తానని అప్పు అనడంతో సెట్ బయపడతాడు. ఆ తర్వాత రెండు నెలల్లో మీరు మొత్తం డబ్బు కట్టమని చెప్పి సేట్ అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంట్లో అందరూ కనకంపై కోప్పడతారు. మరొక వైపు కావ్య ఫజిల్ చేస్తూ.. రాజ్ ని క్వశ్చన్స్ అడుగుతుంది. రాజ్ సమాధానం చెప్తూ కావ్య కి దగ్గరగా వస్తాడు. కావ్యకి దగ్గరగా రాజ్ రావడంతో రాజ్ ముద్దు పెట్టడానికి వచ్చాడనుకొని.. కావ్య గట్టిగా అరుస్తుంది. అరవకంటూ కావ్యతో రాజ్ అంటాడు. మరొకవైపు రాహుల్ ని రుద్రాణి ఆఫీస్ కి పంపిస్తుంటుంది. "ఆఫీస్ వ్యవహరాలు అన్ని నువ్వే చూసుకో, రాజ్ ఆఫీస్ గురించి పట్టించుకోకుండా ఇంట్లో గురించి టెన్షన్ పడేలా నేను చేస్తాను. ఆఫీస్ ని బాగా చూసుకుంటే తాతయ్య దృష్టి నీ మీద పడుతుంది. తన కంటే రాహుల్ ఆఫీస్ వ్యవహరాలు బాగా చూసుకుంటున్నాడు" అని అందరు అనుకోవాలని రాహుల్ తో రుద్రాణి చెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడు. అలా వెళ్లడంతోనే అమ్మాయి తో ఫ్లర్టింగ్ మొదలు పెడతాడు.

ఆ తర్వాత రాహుల్ వెళ్లి రాజ్ క్యాబిన్ లో కూర్చొని ఉంటాడు. ఆఫీస్ బాయ్ వచ్చి.. ఇది రాజ్ సర్ క్యాబిన్. మీది వేరే దగ్గర అనేసరికి రాహుల్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి శృతి డిజైన్ తీసుకొని వస్తుంది. ఇవి రాజ్ సర్ చూసి ఓకే చేశాకే క్లయింట్ కి పంపాలని శృతి అంటుంది. రాజ్ సర్ కి చూపించాల్సిన పని లేదు. నేను ఓకే చేస్తున్న పంపించండని రాహుల్ అంటాడు. ఆ తర్వాత రాజ్ కి క్లయింట్ ఫోన్ చేసి డిజైన్ ఇలా పంపిస్తారా అని అంటాడు. రాజ్ కోపంగా శృతి దగ్గరికి వచ్చి.. ఆ డిజైన్స్ ఎందుకు పంపావని అడుగుతాడు. నేనే పంపమన్నాని రాహుల్ అనగానే.. అందరి ముందే రాహుల్ ని రాజ్ తిడతాడు. ఆ తర్వాత రాహుల్ ని అందరి ముందు తిట్టేసరికి రుద్రాణి రాజ్ రాగానే అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.