English | Telugu

ఏంటి బావా నీకు అందరూ మరదళ్లేనా..రఘు కుంచెని ఆటపట్టించిన అశ్విన్ బాబు

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బోనాల స్పెషల్ గా రూపొందించారు. ఇందులో హోస్ట్ శ్రీముఖి ఫుల్ ట్రెడిషనల్ గా వచ్చేసింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. ఇక ఈ షోకి హిడింబా టీం నుంచి అశ్విన్ బాబు, రఘుకుంచె డైరెక్టర్ అనిల్ కృష్ణ  కూడా వచ్చారు. "హిడింబా అనగానే మీరు అశ్విన్ గారినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు" అని డైరెక్టర్ ని అడిగేసరికి "కటౌట్ చూడలేదా" అన్నారు. రఘుకుంచే చాలా సైలెంట్ గా ఉండేసరికి "ఈ యాక్టింగ్ ఏంటబ్బా" అని ఆటపట్టించింది శ్రీముఖి. "ఏదోలేబ్బా..జీవితంలో చిన్న మార్పు ఉండాలి కదా అప్పుడప్పుడు" అన్నాడు. తర్వాత ఇమేజెస్ చూపించి పాట పాడే గేమ్ లో సిరి హన్మంత్ కరెక్ట్ గా పాడి వినిపించింది.

డ్రామా జూనియర్స్ లో పృద్వి...చిరు, బాలయ్య రోల్స్ లో చిన్నారులు

డ్రామా జూనియర్స్ సీజన్ 6  నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సీనియర్ నటుడు పృద్వి ఎంట్రీ ఇచ్చారు. "సీజన్ 1 నుంచి చూస్తున్నాను. ఏమిటి నన్ను ఇంకా పిలవలేదు అనుకున్నాను ఇప్పుడు పిలిచారు" అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఫైర్ పండు అనే  చిన్నారి వచ్చి మ్యాజిక్ చేసి చూపించాడు.. జడ్జి శ్రీదేవి నవ్వులోనే మ్యాజిక్ ఉంది అంటూనే, జయప్రద గారు మీ వయసును మార్చేశారు కదూ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేసాడు. ఆ మాటకు తన వయసు ఇంకా స్వీట్ 16  అని చెప్పారు జయప్రద. "మరి నా గురించి ఎం చెప్తావ్ అని బాబు మోహన్ అడిగేసరికి అచికిబుచ్చికి" అంటూ కామెడీ చేసాడు. ఇక ఇందులో లోహిత్ అండ్ టీం అంతా కలిసి 1980 స్ రీ యూనియన్ పేరుతో హీరో హీరోయిన్స్ అందరం ఎక్కడ ఉన్నా కూడా ఏడాదిలో ఒక సారి కలుసుకుంటాం అని చెప్పి ఎంటర్టైన్ చేశారు. ఇక లోహిత్ చిరంజీవిగా, విజయ్ బాలయ్యగా చేశారు.  

సింగర్ సునీత నోటా అల్లు అర్జున్ డైలాగ్....15 న డాలస్ లో ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్

సింగర్ సునీత పాట పాడినా, మాట్లాడినా వినబుద్దేస్తుంది. తెలుగు సింగెర్స్ లో  సునీతకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కేవలం సింగింగే కాదు డబ్బింగ్ కూడా చెప్తారు.  మ్యూజిక్ ఈవెంట్స్‌లో హోస్ట్‌గా, యాంకర్‌గా కూడా ఈమె సందడి చేస్తారు. ఈమె లైఫ్ ఒక ఓపెన్ బుక్...పాటలు పాడటంతో పాటు  సింగింగ్ షోస్ కి జడ్జిగా ఉంటుంది. అలాంటి సునీతకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాష్, కూతురు శ్రేయ. కొడుకు ఆకాష్ ని హీరోని చేసేసారు సునీత..త్వరలో అతను నటించిన "సర్కార్ నౌకరి" ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక కూతురిని కూడా సింగర్ గా చేసేసారు సునీత. ఆమె ఆల్రెడీ నాగ‌చైత‌న్య న‌టించిన "స‌వ్య‌సాచి" మూవీలో " టిక్ టిక్ టిక్అ "నే పాట‌ను పాడారు కూడా. ఇక సునీత-శ్రేయ కలిశారంటే అల్లరి మాములుగా ఉండదు.

తన అందానికి కారణం అది తినడమేనట

రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫాన్స్ తో బాతాకాని కూడా వేస్తుంది, ఆన్సర్స్ ఇస్తుంది. ఇప్పుడు కూడా రండి క్వశ్చన్స్ అడగండి అని పిలిచింది. కొంతమంది కొంటె నెటిజన్స్ కి మాత్రం తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఆన్సర్స్ చెప్పేసింది. "నన్ను పెళ్లి చేసుకుంటావా" అంటే  "నో" అంది. " నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి ఎవరికీ తెలియనిది" అనేసరికి "చెప్పనుగా" అంది. "ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా" అనడంతో "నో" అని చెప్పి పారిపోయే ఎమోజిస్ ని పోస్ట్ చేసింది. "తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఇష్టం" "నాగ చైతన్య, జూ.ఎన్టిఆర్, నాగార్జున, అల్లు అర్జున్, ఇంకా ఉన్నారు" అని సిగ్గుపడుతూ చెప్పింది.

ఆ కాసేపు ఉండే రుచి కోసం వాటిని చంపాలా

సోషల్ మీడియాలో రష్మీ, సదా, రేణు దేశాయ్ ఎక్కువగా మీట్ ఇండస్ట్రీకి  సంబంధించిన ఫొటోస్ ని, ఆర్టికల్స్ ని ఎక్కువగా రాస్తూ షేర్ చేస్తూ ఉంటారు. జంతువులని హింసించేవి, చంపేవి, వాటి మాంసాన్ని అమ్మే వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు.  వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఎక్కువగా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఐతే వీళ్ళు పెట్టే వీడియోస్ కావొచ్చు, పోస్టులు కావొచ్చు బాగా సెన్సేషల్ అవుతూ ఉంటాయి. ఈ విషయం మీద రీసెంట్ గా ట్విట్టర్ లో రష్మీకి, కొంతమంది నెటిజన్స్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఐతే ఈ వీడియోస్ చూసి, ఈ మంచి మాటలు ఎవరు చేంజ్ అవుతారు అని అందరూ అనుకుంటారు. కానీ ఒక్కరు మారినా చాలు కదా...రీసెంట్ గా రేణు దేశాయ్ మీట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వీడియో చూశాకా తాను చాలా మారిపోయాయని ఒక నెటిజన్ పోస్ట్ పెట్టాడు.  

అమ్మకు డైపర్ వేసి క్యారేజ్ పెట్టి పంపేదాన్ని.. ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈవారం ఎంత ఎంటర్టైన్ చేసిందో చివరిలో అంతగా ఏడిపించేసింది.  ఆది సౌమ్యకి వాళ్ళ అమ్మతో ఉన్న పిక్ ని లామినేషన్ చేయించిగిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక అది చూసేసరికి ఒక్కసారిగా బరస్ట్ ఐపోయింది సౌమ్య..."ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. చిన్నప్పుడు మాకు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అందరి ఇళ్లల్లోంచి అన్నం, కూర, పాలు  తెచ్చి అమ్మ నాకు అన్నం పెట్టేది. చిన్నప్పటినుంచే నేను మా వీధిలో ట్యూషన్స్ చెప్పేదాన్ని.  నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుని చదువుకోలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ బుక్స్ మాత్రమే తెచ్చుకుని చదువుకునే దాన్ని. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను నేను పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి అని. ఇక నా ఎడ్యుకేషన్ ఐపోయింది..జాబ్ వస్తుంది అనుకునే టైంలో అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. తీసుకెళ్లి హాస్పిటల్ లో చూపిస్తే అమ్మకు బ్రెయిన్ కాన్సర్ అని చెప్పారు.