English | Telugu

కావ్య ఫోన్ ని తిరిగిచ్చేసిన అపర్ణ.. రుద్రాణి మాస్టర్ ప్లాన్ లో స్వప్న కీలుబొమ్మ కానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -147 లో.. కావ్య, కళ్యాణ్ లను రాజ్ స్టేషన్ నుండి విడిపిస్తాడు. నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే వీడే దొరికాడా వాడికే సరిగా రాదని కావ్యతో రాజ్ అంటాడు. సరే నేను నేర్పిస్తానని కావ్యతో రాజ్ అంటాడు. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతు.. సరే పదండని అనగానే.. ఏంటి ఇప్పుడు ఈ రోజు నువ్వు సాధించిన విజయం చాలు.. తర్వాత చూసుకుందామని రాజ్ అంటాడు. ముగ్గురు ఇంటికి బయల్దేరతారు.

మరొకవైపు రిమోట్ బ్యాటరిస్ గురించి అపర్ణ కప్ బోర్డ్స్ లో చూస్తుంటే.. తనకి అందులో ఇన్ హెలర్లు కనిపిస్తాయి. ఏంటి ఇన్ని హెల్లర్ లు ఉన్నాయని అపర్ణ అడుగుతుంది. ఆ రోజు ఇంట్లో ఇన్ హెల్లర్ లేకపోవడం వళ్లే రాజ్ కి అలా జరిగిందని ఎప్పుడు అందుబాటులో ఉండాలని.. కావ్య అలా పెట్టిందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ గురించి కావ్య ఎంత శ్రద్ధ తీసుకుంటుంది. నువ్వే కావ్యని అర్ధం చేసుకోవటం లేదని ఇందిరాదేవి అంటుంది. ఇప్పుడు నేనేం అన్ననానని అపర్ణ అడుగుతుంది. కావ్య దగ్గర ఫోన్ లేకుండా నువ్వు తీసుకున్నావ్.. తనకి ఎంత ఇబ్బంది అవుతుందని ఇందిరాదేవి అంటుంది. అప్పుడే రాజ్, కావ్య, కళ్యాణ్ ముగ్గురు వస్తారు. వాళ్లని చూసి అపర్ణ లోపలికి కోపంగా వెళ్తుంది. ఏంటి మమ్మీ కోపంగా ఉందని సుభాష్ ని రాజ్ అడుగగా.. అదేం లేదని సుభాష్ అంటాడు. అపర్ణ కావ్య దగ్గర నుండి తీసుకున్న ఫోన్ తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తుంది. మీరు మనస్ఫూర్తిగా ఇస్తున్నారా ఎవరైనా ఇవ్వమంటే ఇస్తున్నారా అని కావ్య అడుగుతుంది. నీకు ఫోన్ ఎంత అవసరమో తెలిసి ఇస్తున్నానని అపర్ణ అంటుంది. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ నే కాదు మీ అత్తయ్యని కూడా గెలుచుకున్నావని కావ్యతో ధాన్యలక్ష్మి అంటుంది. అదంతా చూసిన స్వప్న కోపంగా లోపలికి వెళ్తుంది. స్వప్న దగ్గరికి రాహుల్ వెళ్తాడు. ఈ ఇంట్లో నాకు విలువ లేదు కావ్యతో పోటీ పడను. నా విలువ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తానని రాహుల్ తో‌ స్వప్న అంటుంది. నాకు నీ హెల్ప్ కావాలి మోడలింగ్ చేస్తాను. ఫేమస్ అయిపోతా అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారని స్వప్న అనగానే. రాహుల్ వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. రాహుల్, స్వప్న ఇద్దరు మాట్లాడుకున్నది రుద్రాణి వింటుంది. రాహుల్ బయటకు రాగానే.. తను చెప్పింది చెయ్.. స్వప్న చేసే పనికి ఈ ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చి బయటకు పంపిస్తారు. మనకి కూడా కావలిసింది అదే కదా.. కానీ మనం హెల్ప్ చేస్తున్నట్లు ఇంట్లో వాళ్ళకి చెప్పకని మాట తీసుకోమని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి.

ఆ తర్వాత రాహుల్ వెళ్లి స్వప్నకి హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పగా.. దానికి సరేనని స్వప్న అంటుంది. మరొకవైపు కనకంకి కావ్య ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడే సేట్ డబ్బుల గురించి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అవమానిస్తుంటే.. కావ్య ఫోన్ లో అదంతా వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.