English | Telugu

దయా  వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ.. అయ్యగారే ఫేవరెట్ అంట!

బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో మంచి వీక్షకాదరణ పొందుతోంది.

విష్ణుప్రియకి బిగ్ స్క్రీన్ మీద తనని తాను చూసుకోవాలని ఆశంట.. ఎందుకంటే అది వాళ్ళ నాన్న డ్రీమ్ అంట. తనలోని నటనను ఎవరు గుర్తించకపోయేసరికి డ్యాన్స్ మీద దృష్టి పెట్టి కసరత్తులు చేస్తుంది. యోగాలు, జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ డ్యాన్స్ కోసం తన బాడీనీ మలుచుకుంటుంది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే విష్ణుప్రియ.. తనకి సంబంధించిన ఒక ప్రతీ విషయాన్ని అప్డేడ్ చేస్తుంది. సీనియర్ హీరో జెడీ చక్రవర్తి మొదటిసారి నటిస్తున్న వెబ్ సిరీస్ 'దయా' లో షబానాగా విష్ణుప్రియ చేస్తుంది. అయితే తను షబానాగా చేస్తున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పింది.

కాగా ఇప్పటికే తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న విష్ణుప్రియ తన ఫాలోవర్స్ కి కృతజ్ఞతలు చెప్పింది. రెగ్యులర్ గా జ్యువలరీ, డ్రెస్, ఫోటోషూట్స్ తో బిజీగా ఉండే విష్ణుప్రియ. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చనింగ్' ని స్టార్ట్ చేసింది. ' మీ అమ్మ గురించి చెప్పండి' అని ఒకరు అడుగగా.. " మా అమ్మ మాటలు, హగ్స్, కిస్సెస్ అన్ని మిస్ అవుతున్నాను. తను నాతో ఉన్నంతవరకు అన్నీ మ్యాజికల్ డేస్" అని విష్ణుప్రియ అంది. మేకప్ లేకుండా ఒక ఫోటో అప్లోడ్ చేయమని ఒకరు అడుగగా.. మేకప్ లేకుండా తీసిన తన ఫోటోని విష్ణుప్రియ అప్లోడ్ చేసింది. "మీ ఫేవరెట్ ఆంధ్రా ఫుడ్" అని ఒకరు అడుగగా.. "బీరకాయ పచ్చడి, ముద్దపప్పు ఆవకాయ, బెండకాయ ప్రై" అని విష్ణుప్రియ రిప్లై ఇచ్చింది. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరని ఒకరు అడుగగా.. అక్కినేని అఖిల్ ఫోటో అప్లోడ్ చేసి, ఎప్పటికీ అయ్యగారే నా ఫేవరెట్ క్రికెటర్ అని విష్ణుప్రియ అంది.