Read more!

English | Telugu

బేబీ మూవీ మీద అనసూయ ట్వీట్...ఆ ఇద్దరి మధ్య ఏమీ లేదన్న ఆనంద్ దేవరకొండ  

ఇండస్ట్రీలో అనసూయకి, విజయ్ దేవరకొండ ఫాన్స్  మధ్య ఎం జరిగిందో తేలీదు కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్వీట్ల వార్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన "బేబీ" మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మళ్ళీ టాపిక్ వచ్చింది. అలాగే అనసూయ ఈ బేబీ మూవీ గురించి ట్వీట్ కూడా చేసింది. "ఇదంతా కామెంటరీ తప్ప వాళ్ళ మధ్య పెద్ద ఇష్యూ ఏమీ లేదు. నాకు ఆ ఇష్యూ ఏమిటో కూడా పూర్తిగా తెలీదు." అని చెప్పారు అన్నాను...

అలాగే ట్విట్టర్ గురించి కూడా చెప్పుకొచ్చారు "ట్విట్టర్ ఎలా అయ్యిందంటే మధ్యలో ఒక గేట్ ఉంటుంది అటు ఇటు రెండు కుక్కలు ఉంటాయి...కెమెరా కొంచెం పక్కకు పెడితే అక్కడ అంతా ఖాళీ కొట్టుకోవచ్చు వెళ్లి. కానీ ఇక్కడ గేట్ ఉండేసరికి అరుచుకుంటారు అంతే...రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన ఎవరి మీద కామెంట్స్ చేయం..మన లోకం మనది...అదే ట్విట్టర్ కి వచ్చేసరికి ఏది పోస్ట్ చేసినా దాన్ని కామెంట్ చేస్తారు..మనం ఎవరం కూడా  ఎస్ చెప్పకుండానే ఆ సోషల్ మీడియాలోకి జాయిన్ ఐపోయాం. నేను ఈ ట్రాప్ లో పడలేదు. నేను ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలన్న ఆలోచనే రాదు. నా బ్రెయిన్ ఇంకా అలా ట్యూన్ కాలేదు.. కానీ మన మెమరీ అంత ఈ డివైస్ లోకి వచ్చేసింది. చాలా విషయాలు కూడా దీని వలన మరచిపోతున్న " అని చెప్పుకొచ్చారు ఆనంద్ దేవరకొండ. ఇక ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ "బేబీ" ఒక క్యూట్ లవ్ స్టోరీ త్వరలో ఆడియన్స్ ముందు రాబోతోంది.