English | Telugu

అమ్మకు డైపర్ వేసి క్యారేజ్ పెట్టి పంపేదాన్ని.. ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు


శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈవారం ఎంత ఎంటర్టైన్ చేసిందో చివరిలో అంతగా ఏడిపించేసింది. ఆది సౌమ్యకి వాళ్ళ అమ్మతో ఉన్న పిక్ ని లామినేషన్ చేయించిగిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక అది చూసేసరికి ఒక్కసారిగా బరస్ట్ ఐపోయింది సౌమ్య..."ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. చిన్నప్పుడు మాకు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అందరి ఇళ్లల్లోంచి అన్నం, కూర, పాలు తెచ్చి అమ్మ నాకు అన్నం పెట్టేది. చిన్నప్పటినుంచే నేను మా వీధిలో ట్యూషన్స్ చెప్పేదాన్ని. నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుని చదువుకోలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ బుక్స్ మాత్రమే తెచ్చుకుని చదువుకునే దాన్ని. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను నేను పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి అని. ఇక నా ఎడ్యుకేషన్ ఐపోయింది..జాబ్ వస్తుంది అనుకునే టైంలో అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. తీసుకెళ్లి హాస్పిటల్ లో చూపిస్తే అమ్మకు బ్రెయిన్ కాన్సర్ అని చెప్పారు.

ఎం చేయాలో అర్ధం కాలేదు. వాళ్ళను వీళ్ళను డబ్బులు భిక్షం ఎత్తుకున్నాను. వచ్చిన వాటితో అమ్మకు ట్రీట్మెంట్ చేశారు. రానురాను మీ అమ్మ బ్రెయిన్ చిన్న పిల్లల్లా ఐపోతుంది ఎవరిని గుర్తుపట్టలేరని చెప్పారు. అలాంటి కండిషన్ లో అమ్మ నన్ను గుర్తుపట్టడం మానేసింది. అన్ని దగ్గరుండి అమ్మకు నేనే చూసుకున్నాను. మూడున్నరేళ్లు అమ్మను నేను ఇలా చూసుకున్నాను. రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించాను. స్నానం చేయించి, డైపర్ వేసి, బట్టలు వేసి, క్యారేజ్ రెడీ చేసి సెంటర్ కి పంపించేదాన్ని. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అమ్మ లేదు. నేను దేవుడికి రెండు దీపాలు పెడతాను. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని...మా అమ్మ నాకు పుట్టాలని కోరుకుంటున్న" అని చెప్పి ఏడ్చేసింది. ఇక సెట్ లో అందరూ కూడా సౌమ్య మాటలకు ఏడ్చేశారు. "నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు నీ చేయి వదలడు..మీ అమ్మ నీకు పుడుతుంది" అని ఇంద్రజ చెప్పారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.