English | Telugu

ఆ కాసేపు ఉండే రుచి కోసం వాటిని చంపాలా

సోషల్ మీడియాలో రష్మీ, సదా, రేణు దేశాయ్ ఎక్కువగా మీట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫొటోస్ ని, ఆర్టికల్స్ ని ఎక్కువగా రాస్తూ షేర్ చేస్తూ ఉంటారు. జంతువులని హింసించేవి, చంపేవి, వాటి మాంసాన్ని అమ్మే వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఎక్కువగా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఐతే వీళ్ళు పెట్టే వీడియోస్ కావొచ్చు, పోస్టులు కావొచ్చు బాగా సెన్సేషల్ అవుతూ ఉంటాయి. ఈ విషయం మీద రీసెంట్ గా ట్విట్టర్ లో రష్మీకి, కొంతమంది నెటిజన్స్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఐతే ఈ వీడియోస్ చూసి, ఈ మంచి మాటలు ఎవరు చేంజ్ అవుతారు అని అందరూ అనుకుంటారు. కానీ ఒక్కరు మారినా చాలు కదా...రీసెంట్ గా రేణు దేశాయ్ మీట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వీడియో చూశాకా తాను చాలా మారిపోయాయని ఒక నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

ఈ విషయానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కి రేణు దేశాయ్ తన ఇన్స్టా లో షేర్ చేసింది. "మీరు షేర్ చేసిన వీడియోను అస్సలు చూడలేకపోయాను.. అప్పటి నుంచి నాన్ వెజ్ తినడం మానేశాను..చికెన్ కూడా తినడం మానేసాను... ఆ వీడియో నన్ను చాలా చేంజ్ చేసేసింది " అంటూ ఓ నెటిజన్ రేణూ దేశాయ్‌కి మెసెజ్ పెట్టాడు. అతని అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూనే పక్కన ఒక స్మాల్ నోట్ కూడా రాసింది. ‘ఇన్స్టాగ్రామ్ లో అలాంటి క్రూయల్ వీడియోలు, ఫోటోలు ఎందుకు షేర్ చేస్తావు వాటి వలన ఉపయోగం ఏమిటి అని నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటారు.. ఇలాంటి ప్రశ్నలు కొన్నేళ్లు నన్ను అడుగుతూనే వచ్చారు..కానీ నేను చెప్పేది ఒక్కటే. నాలుక మీద పది, పదిహేను నిమిషాలు ఉండే రుచి అందించడం కోసం అమాయకపు జీవులు చావాలా. మన దేశంలో రోజూ మాంసం తినేవారి సంఖ్య చాలా ఎక్కువని నాకు తెలుసు..అలాంటి వాళ్లంతా కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మనతో పాటు జీవాలకు కూడా ఈ భూమి మీద జీవించే హక్కు ఉంది. " అని రేణూ దేశాయ్ కోరింది...

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.