పెళ్ళై ఆరు నెలలు కాలేదు...భర్తను ద్వేషిస్తున్నానంటూ పోస్ట్ పెట్టిన నేహా చౌదరి
బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఎవరో ఒకరు ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. ఎన్ని సీజన్స్ గడిచినా కూడా ఆడియన్స్ మాత్రం వాళ్ళను అస్సలు మర్చిపోలేరు. అలాంటి వాళ్ళల్లో గీతూ రాయల్, బాలాదిత్య, నేహా అని చెప్పుకోవచ్చు. అలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో నేహా పొడుగు కాళ్ళ సుందరిగా పేరు తెచ్చుకుంది. ఆమె ఒక యాంకర్, డ్యాన్సర్, యోగా ట్రైనర్, జిమ్నాస్ట్‌తో పాటు అథ్లెట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక ఆమె వివాహం చేసుకుంది. ఇంజనీరింగ్ చేసే టైంలోనే తాను ఎంతో ఇష్టపడిన అనిల్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అనిల్ జాబ్ జర్మనీలో కావడంతో అతనితో కలిసి జర్మనీ వెళ్లిపోయింది.