English | Telugu

బిగ్ బాస్ కంటే రెడ్ఎఫ్ఎమ్ అంటేనే ఇష్టమన్న ఆర్జే చైతు!


ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5 ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి.

ఆర్జే కాజల్ తనకు సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' ని స్టార్ట్ చేసింది.

క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్ లో ఆర్జే చైతు పార్టిసిపేట్ చేసాడు. దాంతో కాజల్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు చైతుని అడిగింది. నీకు రెడ్ ఎఫ్ఎమ్ ఇష్టమా? లేక బిగ్ బాస్ ఇష్టమా? అని కాజల్ అడుగగా.. నాకు ఇప్పటికీ ఎప్పటికీ రెడ్ ఎఫ్ఎమ్ అంటేనే ఇష్టమని చైతు రిప్లై ఇచ్చాడు. దాంతో కాజల్ షాక్ అయి ఎందుకని అడుగగా.. నాకు ఫస్ట్ నుండి పేరు తెచ్చింది రెడ్ ఎఫ్ఎమ్.‌ నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది రెడ్ఎఫ్ ద్వారానే అని సమాధానమిచ్చాడు చైతు. నీకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న ఆర్జే ఎవరని కాజల్ అడుగగా.‌. "నాకు టఫ్ కాంపిటీషన్ అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే ఎవరిది వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవరితో నేను కంపేర్ చేసుకోను ఎందుకంటే నాకు నేనే పోటీ" అని చైతు సమాధానమిచ్చాడు.



Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.