Read more!

English | Telugu

కొత్త రీల్ తో ట్రెండింగ్ లోకి వచ్చిన కృష్ణ, ముకుంద!

యశ్మీ గౌడ.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ముకుంద అంటే దాదాపు అందరికి తెలుసు . స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ లో ముకుంద పాత్రలో యశ్మీ గౌడ చేస్తుంది. ఈ సీరియల్ లో మురారిని ప్రేమించిన ప్రేయసిగా యశ్మీ గౌడ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఇన్ స్టాగ్రామ్ లో ఈ సీరియల్ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది ముకుంద అలియాస్ యశ్మీ గౌడ.

"స్వాతి చినుకులు" సీరియల్ తో బుల్లితెరపై అరంగేట్రం చేసింది యశ్మీ గౌడ. చిన్నతనం నుండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో అద్దం ముందు తనకు తానే ప్రాక్టీస్ చేసేదని, అదే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చానని యశ్మీ గౌడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. జీ తెలుగులో ప్రసారమవైన 'నాగభైరవి' సీరియల్ లో ముఖ్య పాత్రను పోషించిన యశ్మీ.. 'త్రినయని' సీరియల్ లో గెస్ట్ రోల్ గా కూడా చేసింది. అయితే సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చింది యశ్మీ గౌడ. అయితే యశ్మీకి పింగాణి పాత్రలు, టీ కప్స్ డిజైన్ చేయడమంటే ఇష్టమంట దాంతో తన సొంతంగా బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది యశ్మీ గౌడ.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో యశ్మీ గౌడ పాత్రకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. విలన్ కమ్ హీరోయిన్ లా డ్యూయల్ రోల్ ని పోషిస్తుంది యశ్మీ గౌడ. ఒకవైపు తను ప్రేమించిన మురారి కోసం తపించే హీరోయిన్ గా, మరొకవైపు కృష్ణ, మురారీలను విడదీయాలని అన్ని ప్లాన్స్ వేస్తూ, అడుగడుగునా మురారికి ఇబ్బంది కలిగిస్తూ కన్నింగ్ ఆలోచనలతో లేడీ విలన్ రోల్ ని ప్లే చేస్తుంది యశ్మీ గౌడ. అయితే ఎలాగైనా మురారిని దక్కించుకోవాలనే ముకుంద ప్రయత్నాలు స్టార్ మా టీవీ ప్రేక్షకులకి ఎంతగానో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

అయితే ముకుంద తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక రీల్ ని షేర్ చేసింది. ఈ రీల్ లో కృష్ణ, ముకుందలతో పాటు మధు వాళ్ళ భార్య కూడా కలిసి నటించారు‌.కృష్ణ అలియాస్ ప్రేరణ కంబం తన యాక్టింగ్ తో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ఈ వీడియోకి ఇప్పుడు విశేష స్పందన లభిస్తుంది. కాగా ఇన్‌ స్టాగ్రామ్ లో ముకుంద చేసిన ఈ రీల్ ట్రెండింగ్ లో ఉంది.