English | Telugu

ఎవరు ద్వేషించినా నేను ప్రేమిస్తూనే ఉంటాను


సింగర్ శ్రీరామచంద్ర గురించి అందరికీ తెలుసు. మంచి పాటలతో అలరిస్తూ ఉంటాడు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 2007 లో సింగర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దాదాపు 15 ఏళ్లుగా పాటలు పాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మూవీలో "గెలుపు తలుపులే" అంటూ పాడిన పాటకు ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. ఇక ఎన్ని పాటలు పాడినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా మంచి హిప్ వచ్చింది. అలాంటి శ్రీరామచంద్ర ఈమధ్య ఫారెన్ వెళ్లి మంచి మంచి షోస్ , ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇక శ్రీరామచంద్ర, రేవంత్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ ..ఐతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే శ్రీరామచంద్ర ఇప్పుడు తన స్టేటస్ లో ఫోటో పెట్టాడు. చేతికి క్యాన్ లా పెట్టుకుని విక్టరీ అంటూ రెండు వేళ్ళు చూపిస్తూ ఉన్న ఫోటో అది .."ద్వేషించే వాళ్ళు ద్వేషించనీ..కానీ నేను మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. తిరిగి మంచిగా వస్తాను" అని ఒక హార్ట్ ఎమోజితో ఒక టాగ్ లైన్ టైపు చేసి పెట్టాడు. కానీ తనకు ఏమయ్యిందో మాత్రం ఎక్కడ చెప్పలేదు. త్వరలో ఆహా వేదిక మీద ప్రసారం కాబోతున్న నేను సూపర్ విమెన్ షోకి హోస్ట్ గా కనిపించబోతున్నాడు. 2010 కి గాను ఇండియన్ ఐడియల్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలిచాడు శ్రీరామచంద్ర. ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడి ఎన్నో వేదికల్లో టైటిల్ విజేతగా నిలిచాడు ఈ సింగర్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 కి హోస్ట్ గా కూడా చేసాడు. మరి ఇంతకు ఏమయ్యిందో కానీ ఇలా కొంచెం డల్ గా కనిపించాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.