English | Telugu

బిగ్ బాస్ బ్యూటీ సొంత విల్లాలో రేవ్ పార్టీ.. 11 మంది అరెస్ట్!

బిగ్ బాస్ ఫేమ్ హిమజకు సంబంధించిన ఒక న్యూస్ రీసెంట్ గా  టాప్ హెడ్ లైన్స్ లో వచ్చిన విషయం తెలిసిందే.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తన సొంత విల్లాలో రేవ్ పార్టీ చేసుకున్నట్లు ఈ పార్టీపై పోలీసులు దాడి చేసి హిమజ సహా 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ వార్తపై హిమాజ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో తాను  దీపావళి పండుగ కొత్త ఇంటిలో ఘనంగా జరుపుకుంటుంటే  కొన్ని ఛానల్స్,   ఫేక్ యాప్ లు తనపై  తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటూ ఫైర్ అయ్యారు.  అటువంటి వార్తల్ని నమ్మొద్దంటూ హితవు పలికారు. తన  ఇంట్లో పార్టీ జరిగిన మాట వాస్తవమే..ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారానికి పోలీసులు  వచ్చి తన ఇంటిని సోదాలు  చేశారని తాను  కూడా ఎంక్వైరీకి సహాకరించాను అని చెప్పారు హిమజ.